హుస్సేన్‌ సాగర్‌ ఘటనలో వ్యక్తి మృతి

https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398202-fire-accident-in-hussain-sagar.webp

2025-01-28 05:38:05.0

సికింద్రాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన గణపతి

హుస్సేన్‌ సాగర్‌ ఘటనలో చికిత్స పొందుతూ గణపతి అనే వ్యక్తి మృతి చెందాడు. పడవలో బాణసంచా పేలిన ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. సికింద్రాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.మరోవైపు ఈ ఘటనలో గల్లంతైన బీటెక్‌ విద్యార్థి అజయ్‌ కోసం రెండోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం రాత్రి నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ”భారతమాతకు మహా హారతి” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తవగానే తెలంగాణ టూరిజం శాఖకు చెందిన రెండుబోట్లను బాణాసంచా పేల్చేందుకు హుస్సేన్‌ సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లారు. బాణాసంచా పేల్చుతున్న క్రమంలో నిప్పురవ్వలు అవే బోట్లపై పడటంతో వాటిలో ఉన్న బాణాసంచా పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండు బోట్లలో టూరిజం సిబ్బందితో పాటు బాణాసంచా పేల్చేందుకు ఏర్పాటు చేసిన ఏడుగురు ఉండగా ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చికిత్స పొందుతూ గణపతి మృతి చెందాడు.

Man dies,In Hussain Sagar incident,Hussain Sagar,Fire Accident,3 People Injured