హుస్సేన్‌ సాగర్‌ లో యువకుడి మిస్సింగ్‌

https://www.teluguglobal.com/h-upload/2025/01/27/1397919-ajay-missing.webp

2025-01-27 05:52:41.0

రాత్రి అగ్నిప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన అజయ్‌

హుస్సేన్‌ సాగర్‌ లో యువకుడు మిస్సింగ్‌ అయ్యాడు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆదివారం రాత్రి నక్లెస్‌ రోడ్డులో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమాన్ని చూడటానికి నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన అజయ్ తన స్నేహితులతో కలిసి హుస్సేన్‌ సాగర్‌ వచ్చాడు. హుస్సేన్‌ సాగర్‌ లో భారీ అగ్నిప్రమాదం తర్వాత అజయ్‌ కనిపించకుండా పోయాడు. సోమవారం ఉదయం అతడి కుటుంబ సభ్యులు హుస్సేన్‌ సాగర్‌ వద్దకు వచ్చి అజయ్‌ మిస్సింగ్‌ గురించి చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అజయ్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రెస్క్యూ టీములతో పాటు పోలీసు బృందాలు హుస్సేన్‌ సాగర్‌ లో గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

Hussain Sagar,Young Boy Missing,Ajay,Fire Accident,Fire Works