2022-06-17 02:30:07.0
ఎంతో కాలంగా మానవాళిని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని అంతమొందించేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల కృషిలో భారీ ముందడుగు పడింది. ఎయిడ్స్ నివారించేందుకు వారు ఒక ప్రత్యేకమైన జన్యు చికిత్సను అభివృద్ధి చేశారు. ఇది వ్యాక్సిన్‌గా కానీ లేదా హెచ్ఐవి రోగులకు ఒకేసారి నివారణగా కానీ ఉపయోగపడేలా అభివృద్ధి చేశారు. టెల్ అవీవ్ యూనివర్శిటీకి చెందిన బృందం హెచ్‌ఐవి వైరస్ కు వ్యతిరేక యాంటీ బాడీలు తయారయ్యేలా రోగి శరీరంలోని టైప్-బి తెల్ల […]
ఎంతో కాలంగా మానవాళిని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని అంతమొందించేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల కృషిలో భారీ ముందడుగు పడింది. ఎయిడ్స్ నివారించేందుకు వారు ఒక ప్రత్యేకమైన జన్యు చికిత్సను అభివృద్ధి చేశారు. ఇది వ్యాక్సిన్‌గా కానీ లేదా హెచ్ఐవి రోగులకు ఒకేసారి నివారణగా కానీ ఉపయోగపడేలా అభివృద్ధి చేశారు.
టెల్ అవీవ్ యూనివర్శిటీకి చెందిన బృందం హెచ్‌ఐవి వైరస్ కు వ్యతిరేక యాంటీ బాడీలు తయారయ్యేలా రోగి శరీరంలోని టైప్-బి తెల్ల రక్త కణాల పై దృష్టి సారించింది. వన్ టైమ్ ఇంజెక్షన్ టెక్నిక్ వ్యాధికి కారణమయ్యే హెచ్‌ఐవి వైరస్‌కు వ్యతిరేకంగా తటస్థీకరించే యాంటీ బాడీలను స్రవించడానికి రోగి శరీరం లోపల జన్యు సవరణ సాంకేతికత అయిన సిఆర్ ఐఎస్ పిఆర్ ను ఉపయోగించి జన్యుపరంగా తయారయిన టైప్-బి తెల్ల రక్త కణాలను ఉపయోగిస్తుందని ‘నేచర్ జర్నల్’ లో వారు ప్రచురించిన ఒక పరిశోధనా పత్రంలో వివరించారు.
బి- కణాలు వైరసులు , బ్యాక్టీరియా వంటి తదితరాలకు వ్యతిరేకంగా యాంటీ బాడీలను ఉత్పత్తి చేసే ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఎముక మజ్జలో బి- కణాలు ఏర్పడతాయి. అవి పరిపక్వం చెందినప్పుడు, ఈ కణాలు రక్తం , శోషరస వ్యవస్థలోకి అక్కడి నుండి శరీరంలోని వివిధ భాగాలకు వెళతాయని పేర్కొన్నారు. “ఇప్పటి వరకు ,ఈ అధ్యయనంలో దీన్ని శరీరంలో పనిచేసేలా ఈ కణాలకు కావలసిన మాంటీ బాడీలను ఉత్పత్తి చేసేలా చేయడంలో మొదటి వరసలో ఉన్నాము.” అని వర్సిటీకి చెందిన డాక్టర్ ఆది బార్జెల్ తెలిపారు.
జెనెటిక్ ఇంజినీరింగ్ అనేది వైరస్‌ల నుండి తీసుకోబడిన వైరల్ క్యారియర్‌లతో తయారు చేసిందని బార్జెల్ వివరించారు. దీని వల్ల ఎటువంటి హాని కలిగించకుండా, యాంటీబాడీ కోసం కోడ్ చేయబడిన జన్యువును శరీరంలోని బి- కణాలలోకి తీసుకురావడానికి మాత్రమే రూపొందించామన్నారు. “అంతేగాక మేము బి- సెల్ జన్యువులో కావలసిన సైట్‌లో యాంటీబాడీలను ఖచ్చితంగా పరిచయం చేయగలిగాము. ఈ చికిత్సను అందించిన అన్ని రకాల జంతువులు దీనికి ప్రతిస్పందించాయి. వాటి రక్తంలో కావలసిన యాంటీబాడీలను ఎక్కువ పరిమాణంలోనే తయారయ్యాయని” తెలిపారు.
“మేము రక్తం నుండి యాంటీబాడీని ఉత్పత్తి చేసాము. ల్యాబ్ డిష్‌లోని హెచ్‌ఐవి వైరస్‌ను తటస్థీకరించడంలో ఇది వాస్తవానికి ప్రభావవంతంగా ఉందని నిర్ధారించుకున్నాము” అని బార్జెల్ తెలిపారు. ప్రస్తుతం, పరిశోధకులు వివరించారు, ఇప్పటివరకు ‘ఎయిడ్స్’ వ్యాధి కోసం జన్యు చికిత్స లేదు కాబట్టి దీనిపై పరిశోధన అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. రోగుల పరిస్థితిలో విపరీతమైన మెరుగుదలను తీసుకువచ్చే సామర్థ్యంతో, వైరస్‌ను వన్-టైమ్ ఇంజెక్షన్‌తో రూపుమాపేందుకు వినూత్న చికిత్సను అభివృద్ధి చేశామన్నారు.
“ఈ అధ్యయనం ఆధారంగా, రాబోయే సంవత్సరాల్లో మేము ఎయిడ్స్‌కు, ఇతర అంటు వ్యాధులకు, గర్భాశయ క్యాన్సర్ తో పాటు వైరస్ వల్ల కలిగే తల, మెడ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌లకు ఈ విధంగా మందులను తమారు చేయగలమని ఆశిస్తున్నాము” అని అన్నారు.