హెచ్‌ఐవీ టెస్టు చేయించుకున్న బ్రిటన్‌ ప్రధాని

2025-02-11 07:34:56.0

2030 నాటికి కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదు కూకూడదనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చి టెస్టు చేయించుకోవాలని కోరిన యూకే ప్రధాని

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ హెచ్‌ఐవీ టెస్టు చేయించుకున్నారు. జీ 7 నాయకుల్లో బహిరంగంగా హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్న మొదటి ప్రధాని స్టార్మర్‌ అని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చింది. హెచ్‌ఐవీ పరీక్ష వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని స్టార్మర్‌ హెచ్‌ఐవీ టెస్టు చేయించుకున్నారు. టెరెన్స్‌ హిగ్గిన్స్‌ సంస్థతో కలిసి ర్యాపిడ్‌ హోమ్‌ టెస్టు చేయించుకున్నారని పేర్కొన్నది.హెచ్‌ఐవీ టెస్టు ఎంతో ముఖ్యమైనదని, ఇందులో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని స్టార్మర్‌ వెల్లడించారు. క్షణాల్లో జరిగిపోయే ఈ పరీక్షను వారం రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు అన్నారు. 2030 నాటికి కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదు కూకూడదనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చి టెస్టు చేయించుకోవాలని కోరారు. 2030 నాటికి ఒక్క హెచ్‌ఐవీ కేసు నమోదు కాకూడదనే లక్ష్యానికి స్టార్మర్‌ కట్టుబడి ఉన్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. దీనికి సంబంధించి ఈ ఏడాదిలో ఒక యాక్షన్‌ ప్లాన్‌ కూడా రూపొందించినట్లు వెల్లడించింది.

Keir Starmer,Becomes first PM,To take HIV test,Terrence Higgins Trust representatives,PM took a rapid home tes