2024-09-26 13:39:35.0
ఫొటోలో ‘ఎక్స్’లో షేర్ చేసిన జార్ఖండ్ సీఎం
https://www.teluguglobal.com/h-upload/2024/09/26/1363456-hemanth-soren.jfif
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో ఆయన లాంటి వ్యక్తి భేటీ అయ్యారు. తనను పోలిన వ్యక్తిని కలిసిన విషయాన్ని హేమంత్ సోరేన్ స్వయంగా తన అధికారిక ‘ఎక్స్’ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అచ్చు గుద్దినట్టు హేమంత్ సోరేన్ ను పోలి ఉన్న వ్యక్తి పేరు మున్నా లోహ్రా. రాంచీకి చెందిన ఆయన థియేటర్ ఆర్టిస్ట్. సీఎం హేమంత్ సోరేన్ ను బుధవారం ఆయన నివాసంలో లోహ్రా తన కుటుంబ సభ్యులతో కలిశారు. ఆ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేస్తూ ”హేమంత్ సోరేన్ ను కలిసిన మరో హేమంత్ సోరేన్” అని క్యాప్షన్ పెట్టారు. ఇంతకీ మీలో అసలు సోరేన్ ఎవరు అని కొందరు.. కుంభమేళాలో తప్పిపోయిన అన్నాదమ్ములు కలిసినట్టు ఉందని ఇంకొందరు.. ఇద్దరూ ఒకేలా ఉన్నారు అని మరికొందరు ఇలా కామెంట్స్ పెట్టారు. ఫొటోలో కండువా కప్పుకున్న వ్యక్తి లోహ్రా. సీఎం సోరేన్ కు తాను పెద్ద ఫ్యాన్ ను అని, థియేటర్ ఆర్టిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు.
Hemant Soren,A person like Hemant,Munna lohra,Ranchi,Theater artist,Met Soren