హేమకు మా షాక్‌..మా సభ్యత్వం రద్దు!

 

2024-06-05 16:44:30.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/05/1333994-actress-hema.webp

సినీ నటి హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ – మా షాక్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హేమను సస్పెండ్ చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సినీ నటి హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ – మా షాక్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హేమను సస్పెండ్ చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాలో ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

రేవ్‌ పార్టీ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హేమను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హేమను జూన్ 14 వరకు జ్యుడిషియర్ కస్టడీకి కూడా అప్పగించింది కోర్టు. ఇక బ్లడ్‌ శాంపిల్స్ రిపోర్టులో హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు రుజువు కావడంతో ఆమె వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మొదట్లో హేమపై ఆరోపణలు వచ్చిన సమయంలో హేమకు మద్దతుగా నిలిచారు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు. హేమపై నిరాధార ఆరోపణలు తగవంటూ ట్వీట్ చేశారు. హేమపై ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామన్నారు. ఐతే తాజాగా హేమపై ఆరోపణలు నిజం కావడం, బెంగళూరు పోలీసులు ఆరెస్టు చేయడంతో హేమపై వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం మంచు విష్ణు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

బెంగళూరు శివారులోని ఎలక్ట్రానిక్ సిటీలో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు సినీ నటులు, మోడల్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. మొత్తం 100 మందికి పైగా ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలిపిన బెంగళూరు పోలీసులు…86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు.

 

Bangalore Rave Party,Actress Hema,MAA Association,Membership,Tollywood