https://www.teluguglobal.com/h-upload/2025/01/27/1397950-eetala.webp
2025-01-27 07:54:33.0
పోచారం పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. పోచారం పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలనగర్‌లో స్థిరాస్తి వ్యాపారిపై చేసుచేసుకున్నారని ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు. దీంతో ఈటల హైకోర్టును ఆశ్రయించారు.
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్‌లో ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. గత మంగళవారం మున్సిపాలిటీలో ఈటల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారిపై ఈ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై చేయి చేసుకున్నారు. ఈటల చేయిసుకోగానే బీజేపీ కార్యకర్తలు ఆయనపై దాడికి చేశారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు కొనుక్కున్న జాగాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు. భూములు కొనుక్కున్న పేదల సమస్యలపై కలెక్టర్, సీపీతో మాట్లాడాను. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారని ఈటల ఆరోపించారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కవుతున్నారు. కూల్చివేతలు తప్ప.. పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ఈటల ధ్వజమెత్తారు.
BJP,Eatala Rajender,Telangana High Court,Case,Dismiss