హైకోర్టులో కేటీఆర్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

https://www.teluguglobal.com/h-upload/2025/01/08/1392529-ktr-lunch-motion-pitition.webp

2025-01-08 05:43:05.0

ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖల చేసిన మాజీ మంత్రి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ విచారణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం విచారణకు రావాలసి ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 6న కేటీఆర్‌ను ఏసీబీ విచారించాల్సింది. కానీ.. తన న్యాయవాదిని అనుమతించనందున హాజరుకాలేనంటూ.. ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లారు. దీంతో ఆరోజు విచారణ జరగలేదు. దాంతో ఏసీబీ అధికారులు అదేరోజు ఆయనకు మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న (గురువారం) విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

KTR,Lunch Motion Petition,In High Court,ACB,Formula e-Car Race case