హైకోర్టులో మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

 

2024-12-13 07:46:59.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/13/1385485-mohan-babu.webp

పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేరొన్న మోహన్‌బాబు

సినీనటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసం వద్దకు వెళ్లిన జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. 

 

Mohan Babu,Anticipatory bail petition,Telangna High Court,Attack on journalist,Jalpally