హైదరాబాద్‌లో ఈ ఫేమస్ బిర్యానీలు తెలుసా?

https://www.teluguglobal.com/h-upload/2023/05/31/500x300_774007-hyderabad-biryani.webp
2023-05-31 19:03:51.0

Hyderabad biryani: ప్రపంచంలోనే బిర్యానీకి కేరాఫ్ అడ్రెస్ హైదరాబాద్.

ప్రపంచంలోనే బిర్యానీకి కేరాఫ్ అడ్రెస్ హైదరాబాద్. హైదరాబాద్ అంటే ముందు గుర్తొచ్చేది బిర్యానీ. బిర్యానీలో ఉన్న రకరకాల ఫ్లేవర్స్‌ను హైదరాబాద్‌లో ట్రై చేయొచ్చు. హైదరాబాద్‌లో ట్రెడిషనల్ ధమ్ బిర్యానీతో పాటు భిన్న సంప్రదాయాలు, అభిరుచులకు తగ్గట్టుగా రకరకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..

హైదరాబాద్‌లో ఎక్కువగా దొరికేది ధమ్ బిర్యానీ. వరల్డ్‌ ఫేమస్‌ హైదరాబాదీ బిర్యానీ నిజాం నవాబుల కాలం నుంచీ ఉంది. బాస్మతి బియ్యం, మాంసాన్ని రెండు లేయర్ల పద్ధతిలో వండుతారు. హైదరాబాద్‌లో కామన్ కనిపించే బిర్యానీ ఇది.

మొఘలాయి

పెరుగు, బాదం పేస్ట్, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో మాంసాన్ని కలిపి వండే బిర్యానీని మొఘలాయీ బిర్యాని అంటారు. ఇది. మొఘలాయుల కిచెన్ నుంచి వచ్చింది. హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతంలోని రెస్టారెంట్లలో ఈ బిర్యానీ ట్రై చేయొచ్చు.

ఆఫ్ఘానీ

ఆఫ్గానీ బిర్యానీలో మసాలాలు తక్కువగా వాడతారు. డ్రైఫ్రూట్స్‌తో పాటు జైఫల్, జాపత్రి, నెయ్యి ఎక్కువగా వేస్తారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ ఏరియాలో ఈ బిర్యానీ ట్రై చేయొచ్చు.

సింధీ

ఇది గుజరాతీ స్టైల్ బిర్యానీ. ఇందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, డ్రైఫ్రూట్స్ వాడతారు. ఈ బిర్యానీ ట్రై చేయాలంటే సికింద్రాబాద్‌లో ఉన్న సింధీ రెస్టారెంట్‌కు వెళ్లాలి.

లక్నోవీ

నిజామ్‌ల కిచెన్ నుంచి వచ్చిన లక్నోవీ బిర్యానీ.. తక్కువ స్పైస్‌తో రుచికరంగా ఉంటుంది. ఈ డిష్ ను హైదరాబాద్ మీరాలంమండిలోని కొన్ని రెస్టారెంట్స్‌లో ట్రై చేయొచ్చు.

Hyderabad,Biryani,Biryani Restaurant,Chicken Biryani,Food
Hyderabad, Hyderabad Biryani Special, Hyderabad Famous Biryani Names, 7 Types Of Biryani In Hyderabad, Hyderabad Famous Biryani Names, Telugu News

https://www.teluguglobal.com//health-life-style/hyderabadi-biryani-do-you-know-these-famous-biryanis-in-hyderabad-936811