హైదరాబాద్‌లో ఏఐ కేంద్రం.. ప్రభుత్వంతో ఒప్పందం

2025-02-13 15:12:36.0

హైదరాబాద్ లో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లుగా గూగుల్ ప్రకటించింది

హైదరాబాద్‌లో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లుగా గూగుల్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. టీ హబ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా స్టార్టప్స్, ఏఐ పరిశ్రమలు, వ్యవసాయం, విద్యా, రవాణా, ప్రభుత్వ డిజిటల్ కార్యక్రలాపాలకు గూగుల్ తోడ్పాటు అందించనుంది.

హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని.. మైక్రోసాఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు.

AI Center,Google,CM Revanth Reddy,Minister Sridhar Babu,T Hub,Microsoft,Artificial Intelligence,Telangana Goverment,startups