హైదరాబాద్‌లో గోనే సంచిలో డెడ్ బాడీ కలకలం

https://www.teluguglobal.com/h-upload/2024/12/24/1388591-body.webp

2024-12-24 05:48:49.0

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. గోనే సంచిలో డెడ్ బాడీ కలకలం రేపింది.

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోనే సంచిలో డెడ్ బాడీ కలకలం రేపిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో చోటుచేసుకుంది. గోనే సంచిలో మృతదేహన్ని జీహెచ్ఎంసీలో కార్మికులు గుర్తించి.100 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు కార్మికులు.దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి మైలార్ దేవ్ పల్లి పోలీసులు… చేరుకున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు.

ఎక్కడో చంపి సంచిలో మూట కట్టి దుర్గానగర్ వద్ద పడేశారట దుండగులు. ఇక హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అనే సమాచారాన్ని స్వేకరిస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు. ఇక గోనే సంచిలో డెడ్ బాడీ కలకలం రేపిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రైమ్‌ రేట్‌ విపరితంగా పెరిగింది. రాష్ట్రంలో హోం శాఖ మంత్రి లేడు. నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Hyderabad,Dead body,sack,GHMC,Mylar Dev Palli,Ranga Reddy District,Congress Goverment,CM Revanth reddy,Telangana police