2025-02-07 09:20:36.0
నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు
హైదరాబాద్‌లో మరో మానవీయ ఘటన జరిగింది. రంగారెడ్డి – నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని సదరు యువతిని బెదిరించారు. ఎట్టకేలకు అసలు విషయం బయటకు రావడంతో యువతి కుటుంబ సభ్యులు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలకు ఆగడం లేదు. ముక్కుపచ్చలారని పసికందు నుంచి ముసలి వాళ్లను కూడా కామాంధులు వదలడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో హొం శాఖ మంత్రి లేకపోవడంతో శాంతి భద్రతలు చక్కదిద్దే నాధుడే కరవయ్యాడు.
Gang rape,Hyderabad,Narsinghi PS,Hydershakot,Telangana,Crime rate,CM Revanth reddy,Telanagana goverment,DGP Jitender,Telangana police