హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి

2025-02-28 15:23:45.0

నార్సింగి మండలం పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్ పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పాషా కాలనీలోని ఓ భవనంలో ఉన్న కిరాణా దుకాణంలోమూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిచ్చెన ద్వారా ఫస్ట్ ఫ్లోర్‌కు చేరుకొని, తలుపులను పగులగొట్టి ఒక చిన్నారి, ఇద్దరు మహిళలను బయటకు తీసుకువచ్చామని తెలిపారు. వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Fire accident,Hyderabad,Three killed,Puppalaguda,Manikonda Municipality,Ranga Reddy District,Narsinghi,CM Revanth reddy Crime news Telanagana