హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

https://www.teluguglobal.com/h-upload/2024/11/11/1376784-arungal.jfif

2024-11-11 09:48:16.0

హైదరాబాద్‌ నగరంలోని ఆరాంఘర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్ ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సుల స్క్రాప్ గోదాములో దట్టమైన మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానిక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్నా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలను గమనించిన స్థానికులు అక్కడినుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని.. 2 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Arangar,Fire accident,Hyderabad,Scrap warehouse,Firefighters,Short circuit