2025-01-12 10:25:43.0
హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా 13 నుంచి 15 వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోటరీ ఎక్స్ రోడ్ నుంచి ఎస్‌బీహెచ్‌కు వెళ్లే దారి.. వైఎంసీఏ నుంచి క్లాక్ టవర్‌కు మళ్లింపు చేస్తారు. రసూల్‌పురా నుంచి ప్లాజాకు వెళ్లే దారి.. సీటీవో ఎక్స్ రోడ్స్ నుంచి బలంరాయికి మళ్లించారు.
పికెట్ నుంచి ఎస్ బీహెచ్ & టివోలికి వెళ్లే మార్గం.. స్వీకార్ ఉపకర్ వద్ద వైఎంసీఏకు మళ్లింంచారు. పికెట్ నుంచి ఎస్ బీహెచ్& టివోలికి వెళ్లే మార్గం.. స్వీకార్ ఉపకర్ వద్ద వైఎంసీఏ కు మళ్లిస్తున్నారు. ఎన్ సీసీ నుంచి ప్లాజాకు వెళ్లే మార్గం.. టివోలి వద్ద నుంచి బ్రూక్‌బాండ్‌కు మళ్లిస్తున్నారు. గేట్ నం.1 నుంచి పబ్లిక్ ఎంట్రీకి అనుమతి.. ఐదు ప్రాంతాల్లో పార్కింగ్‌కి వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
Traffic restrictions,Hyderabad,Secunderabad Parade Grounds,Kite & Sweet Festival,YMCA,Rasulpura,Traffic Police,CM Revanth reddy,Telangana goverment