హైదరాబాద్‌లో 2 రోజులు తాగు నీటి సరఫరా బంద్

2024-12-20 16:14:00.0

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 22, 23 తేదీల్లో తాగు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 22, 23 తేదీల్లో తాగు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. బోరబండ నుంచి లింగంపల్లి వరుకు ఉన్న పైపులైన్‌కు అంతరాయం కలగనుందని అధికారులు తెలిపారు. ఖైరతాబాద్‌లోని పలు బస్తీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెడ్‌హిల్స్‌లో తాగునీటిని సరఫరా చేసే పెద్ద పైప్‌లైన్‌ మరమ్మతుల కోసం ఆదివారం నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు. తాగేందుకు నీరు లేకపోవడంతో కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా నీటి సరఫరా చేయని జలమండలి అధికారులు కనీసం వాటర్‌ ట్యాంకులను పంపే ప్రయత్నం సైతం చేయలేదు. దీంతో కొన్ని బస్తీల ప్రజలు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులకు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad,Drinking water supply,Khairatabad,Redhills,HMDA,GHMC,Water board officials,CM Revanth reddy