హైదరాబాద్ రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా

 

2024-11-25 07:05:40.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/25/1380670-rgv.webp

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది.

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఒంగోలులో నమోదైన ఈ కేసు విచారణకు ఆర్జీవీ హాజరు కాకపోగా.. అరెస్ట్ నుంచి రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. తాము రక్షణ కల్పించలేమని చెప్పడంతో.. విచారణకు వచ్చేందుకు కాస్త సమయం కావాలని ఆర్జీవీ కోరాడు. ఇచ్చిన గడువు ముగిసినా ఆర్జీవీ విచారణకు రాకపోవడంతో.. ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని ఆర్జీవీ డెన్ కు చేరుకున్నారు.

అయితే నేడు ఆర్జీవీ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావలసి ఉంది. తన లాయర్‌తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు ఆర్జీవీ సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనరు. నేపథ్యంలో.. ఆర్జీవీ అసలు ఇంట్లోనే లేరన్న విషయం తెలిసింది. ఎక్కడికెళ్లారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

 

Ram Gopal Varma,Hyderabad,AP Police,Ongole,High Court,Maddipadu Police Station,CM Chandrababu Naidu,Deputy CM Pawan Kalyan,Nara lokesh