హైదరాబాద్ లో అర్దరాత్రి బీజేపీ నాయకుడి అరెస్ట్ !

2022-06-09 21:12:21.0

అర్దరాత్రి హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడిని అరెస్టు చేశారు పోలీసులు. వ‌నస్థలిపురం పనామా గోడౌన్స్ దగ్గర గురువారం అర్ధరాత్రి బీజెపి నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నాయకుడి అరెస్టును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి వెళ్తుండగా పనామా గోడౌన్ల వద్ద జిట్టా బాలకృష్ణరెడ్డి, అతని అనుచరులను పోలీసులు ఆపి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి […]

అర్దరాత్రి హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడిని అరెస్టు చేశారు పోలీసులు. వ‌నస్థలిపురం పనామా గోడౌన్స్ దగ్గర గురువారం అర్ధరాత్రి బీజెపి నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నాయకుడి అరెస్టును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి వెళ్తుండగా పనామా గోడౌన్ల వద్ద జిట్టా బాలకృష్ణరెడ్డి, అతని అనుచరులను పోలీసులు ఆపి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ జిట్టా బాలకృష్ణారెడ్డిపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేయడం పట్ల బాలకృష్ణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కక్ష సాధింపు చర్య అని ఆయన మండిపడ్డారు.తాను సోషల్ మీడియాలో చట్ట‌ వ్యతిరేకమైన ఒక్క పోస్టు కూడా పోస్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. బాలకృష్ణ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 

Arrest,bhuvanagiri,BJP,huyderabad,jitta bakakrishna reddy,Police,vansthalipuram