2016-05-14 07:10:15.0
సెంట్రల్ లండన్‌లో పిడబ్ల్యుసి అనే ఆఫీసులో పనిచేస్తున్న నికోలా థార్ప్ అనే 27 ఏళ్ల రిసెప్షనిస్ట్ ఒక రోజు హై హీల్స్ కాకుండా సమతలంగా ఉన్న షూతో ఆఫీసుకి వచ్చింది. అంతే… సూపర్‌వైజర్ ఆమెను పిలిచి అడిగాడు…ఒకవేళ హైహీల్స్ వేసుకోవటం నచ్చకపోతే ఉద్యోగానికి రానక్కర్లేదు అని కరాఖండిగా చెప్పాడు. అంతేకాదు, ఆమెకు జీతం ఇవ్వకుండానే బయటకు పంపారు. గత ఏడాది డిసెంబరులో నికోలా థార్స్‌కు ఈ పరిస్థితి ఎదురుకాగా అప్పటినుండి ఆమె ఈ విషయంమీద పోరాటం చేస్తూనే […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/high-heels.gif
సెంట్రల్ లండన్‌లో పిడబ్ల్యుసి అనే ఆఫీసులో పనిచేస్తున్న నికోలా థార్ప్ అనే 27 ఏళ్ల రిసెప్షనిస్ట్ ఒక రోజు హై హీల్స్ కాకుండా సమతలంగా ఉన్న షూతో ఆఫీసుకి వచ్చింది. అంతే… సూపర్‌వైజర్ ఆమెను పిలిచి అడిగాడు…ఒకవేళ హైహీల్స్ వేసుకోవటం నచ్చకపోతే ఉద్యోగానికి రానక్కర్లేదు అని కరాఖండిగా చెప్పాడు. అంతేకాదు, ఆమెకు జీతం ఇవ్వకుండానే బయటకు పంపారు.
గత ఏడాది డిసెంబరులో నికోలా థార్స్‌కు ఈ పరిస్థితి ఎదురుకాగా అప్పటినుండి ఆమె ఈ విషయంమీద పోరాటం చేస్తూనే ఉంది. తమ కంపెనీలో పనిచేసే మహిళలు హైహీల్స్ మాత్రమే ధరించాలని యాజమాన్యాలు నిబంధన విధించడం చట్టబద్దం కాదంటూ ఆమె… తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ, దీనిపై తన పిటీషన్‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. గత మంగళవారం ఈ పోస్ట్ చేయగా గురువారం నాటికి లక్షకు పైగా సంతకాలు ఆమెకు అనుకూలంగా వచ్చాయి. దాంతో ఇప్పుడు ఈ విషయంమీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాదు, మహిళలు తమకు నచ్చని నిబంధనలను, మనసు చంపుకుని, ఇబ్బందిని భరిస్తూ ఎలా పాటిస్తున్నారో కూడా దీంతో తేలిపోయింది. ఇప్పటికీ కంపెనీలు తమ ఉద్యోగినులను హైహీల్స్ తప్పనిసరి అని కోరుతున్నాయని, అందుకు చట్టబద్దత ఉందని నికోలా తన పోస్ట్‌లో పేర్కొంది. ఇప్పుడున్న ఫార్మల్ వర్క్ డ్రస్ కోడ్ కాలం చెల్లినదని, మహిళలను అది సెక్సీగా చూపిస్తోందని ఆమె అభిప్రాయపడింది. తన పోస్ట్ కి వచ్చిన స్పందనకు ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఇది కచ్ఛితంగా మార్పురావాల్సిన సమయం అని బిబిసితో అంది. మహిళలతో పాటు మగవారు కూడా తన పిటీషన్‌కి అనుకూలంగా ఉన్నారని ఆమె తెలిపింది. నికోలా ప్రతిఘటనకు అప్పుడే ఫలితం కనిపించింది, ఆమె అంతకుముందు పనిచేసిన కంపెనీ, తమ ఉద్యోగినుల షూ హీల్స్ విషయంలో ఉన్న నిబంధనని సడలించింది. మా మహిళా ఉద్యోగినులు తమకు నచ్చినట్టుగా షూ వేసుకుని రావచ్చని ఆ కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ తెలిపాడు. ఏదిఏమైనా నికోలా థార్ప్ వేసిన ముందడుగుతో స్త్రీలపై చట్టబద్ధంగా అమలవుతున్న ఒక ఆంక్షకు వ్యతిరేకంగా మహిళలు గళం విప్పారు. ఎప్పటికయినా మార్పు తప్పదనే హెచ్చరికని ప్రపంచానికి వినిపించారు.