https://www.teluguglobal.com/h-upload/2024/10/22/1371354-man-died.webp
2024-10-22 08:50:33.0
సీసీ కెమెరాలో రికార్డయిన కుక్క వెంటపడిన, ఉదయ్ పరిగెత్తిన దృశ్యాలు
హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకున్నది. హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురం అశోక్‌నగర్‌లో ఉంటున్న తెనాలి వాసి ఉదయ్ స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీఫ్రైడ్ హోటల్‌కు వెళ్లాడు. మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే కుక్క ఉదయ్ వెంటపడింది. తప్పించుకునే క్రమంలో హోటల్ కిటీకి నుంచి కిందపడి ఉదయ్ ప్రాణాలు కోల్పోయాడు. కుక్క వెంటపడిన, ఉదయ్ పరిగెత్తిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినా బైటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. విషయం బైటికి పొక్కడంతో కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో లాబీలోకి దిగాడు. అక్కడ కుక్కను చూసి దానితో ఆడుకోవడం ప్రారంభించాడు. “ఉదయ్ లాబీలో కుక్క వెనుక పరుగెత్తాడు. ఈక్రమంలోనే అతను తన వేగం నియంత్రణ కోల్పోయాడు. మలుపు తీసుకోలేక మూడవ అంతస్తులోని కిటికీలోంచి పడిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన హోటల్ సీసీ కెమెరాలలో రికార్డయ్యింది. దీనిలో ఉదయ్ కిటికీలోకి దూసుకెళ్లే ముందు కారిడార్ మీదుగా పరిగెత్తడం కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి ఘటనపై ఆంధ్రప్రదేశ్‌లోని మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
youth falls to death,chasing dog,on third floor of hotel,Chandanagar,Ramachandrapuram