2024-11-05 07:10:27.0
https://www.teluguglobal.com/h-upload/2024/11/05/1374910-kanguva.webp
14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సూర్య మూవీ
సూర్య డ్యూయల్ రోల్ లో శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘కంగువ’ మూవీ ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా 10 వేల స్క్రీన్‌లలో రిలీజ్ అవుతోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ మూవీలో బాబి డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణ్యం, యోగిబాబు, రెడిన్ కింగ్ల్సీ, కోవై సరళ, ఆనంద రాజ్, కేఎస్ రవికుమార్ తదితరులు నటించారు. 2019లోనే ఈ ప్రాజెక్టును ప్రకటించినా కరోనా, సూర్య, డైరెక్టర్ శివ ఇతర సినిమాలతో షూటింగ్ మొదలు కాలేదు. 2022 ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది జనవరిలో పూర్తి చేశారు. చెన్నై, గోవా, కొడైకెనాల్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశారు. వేట్రి పలనిసామి సినిమాటోగ్రఫీ అందించగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూర్చారు. సుమారు రూ.350 కోట్లతో చిత్రాన్ని నిర్మించారు. స్టాండర్డ్, 3డీ ఫార్మాట్ లో మూవీ రిలీజ్ చేస్తున్నారు.
Kanguva,Surya,Shiva,Babi Deol,Disha Patani,Studio Green,UV Creations,Devi Sri Prasad