132 రికార్డ్‌ బ్రేక్‌ చేసిన ట్రంప్‌

2024-11-06 09:30:28.0

అధ్యక్షుడిగా ఓటమి తర్వాత ఘన విజయం

అమెరికా 47వ అధ్యక్షుడిగా విజయం సాధించిన రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ 132 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేశారు. గ్రోవర్‌ క్లీవ్‌ ల్యాండ్‌ 1884లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో (1888లో) ఓటమి పాలయ్యారు. 1892 ఎన్నికల బరిలో నిలిచి తిరిగి విజయం సాధించారు. 2016లో అమెరికా ప్రెసిడెంట్‌ గా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ 2020 ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఘన విజయం సాధించి గ్రోవర్‌ క్లీవ్‌ ల్యాండ్‌ రికార్డును తిరగరాశారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారిలో ప్రస్తుత ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ ఎక్కువ వయసున్న వారు కాగా 78 ఏళ్ల వయసులో ప్రెసిడెంట్‌ గా ఎన్నికై అత్యంత ఎక్కువ వయసుండి అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

USA,Donald Trump,Grover Cleveland,President Election