16 ర‌కాల ప్లాస్టిక్ వ‌స్తువుల‌పై నిషేధం విధించిన కేంద్రం..

2022-06-19 04:30:30.0

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కేంద్రం గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఒక‌సారి వాడి పారేసిన 16 ర‌కాల ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను నిషేధించాల‌ని నిర్ణ‌యించింది. ఈ వ‌స్తువ‌ల‌పై నిషేధం జులై ఒక‌ట‌వ‌తేదీ నుంచే అమ‌లులోకి వ‌స్తుంద‌ని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయవద్దని పెట్రోకెమికల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘిస్తే లైసెన్సులు ర‌ద్దు! వాణిజ్య సంస్థలేవీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా […]

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కేంద్రం గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఒక‌సారి వాడి పారేసిన 16 ర‌కాల ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను నిషేధించాల‌ని నిర్ణ‌యించింది. ఈ వ‌స్తువ‌ల‌పై నిషేధం జులై ఒక‌ట‌వ‌తేదీ నుంచే అమ‌లులోకి వ‌స్తుంద‌ని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయవద్దని పెట్రోకెమికల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

ఉల్లంఘిస్తే లైసెన్సులు ర‌ద్దు!

వాణిజ్య సంస్థలేవీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా స్థానికంగా ఉన్న అధికారిక సంస్థ‌లు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేచింది. ఆమేర‌కు ప‌రిశీలించిన త‌ర్వాతే వాణిజ్య సంప్థ‌ల‌కు లైసెన్సులు జారీ చేయాల‌ని సూచించింది. ఈ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా వాటి లైసెన్సుల‌ను రద్దు చేయాలని అటవీ మంత్రిత్వశాఖ త‌న ఉత్త‌ర్వుల్లో తెలిపింది. గ‌త యేడాదే ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ, కాలుష్య నియంత్ర‌ణ శాఖ‌లు ఈ మేర‌కు ప్ర‌తిపాదించాయి.

నిషేధించిన వ‌స్తువులు ఇవే ..

ఇయర్ బడ్స్, బెలూన్లు, క్యాండీ, ఐస్‌క్రీం కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్‌బాక్స్‌లు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్‌లలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే పాలిస్ట్రైరిన్ (థర్మాకోల్) వంటి 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధించింది.

 

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌,ప్లాస్టిక్‌,ప్లాస్టిక్ ముడిసరుకు