1995లో హైదరాబాద్‌ ఎలా ఉండేదో..ఇప్పుడు ఢిల్లీ అలా ఉంది

2025-02-02 17:34:39.0

ఇక్కడి ప్రజలు సరైన గాలి పీల్చాలంటే.. మోడీ ఆక్సిజన్‌ ఇవ్వాలన్న చంద్రబాబు

https://www.teluguglobal.com/h-upload/2025/02/02/1399762-babu.webp

1995లో హైదరాబాద్‌ ఎలా ఉండేదో..ఇప్పుడు ఢిల్లీ అలా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో కూడా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉండి ఉంటే వాషింగ్టన్‌, న్యూయార్క్‌ను తలదన్నేది. వాతావరణ కాలుష్యంతో పాటు ఢిల్లీలో పొలిటికల్‌ కాలుష్యం కూడా పెరిగిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండే షాద్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. 2025లో దావోస్‌లో ప్రపంచం మొత్తం చర్చించిన ప్రధాన అంశాలు ఏఐ, గ్రీన్‌ ఎనర్జీ. 1995లో ఐటీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐపై దృష్టి సారించాను. ప్రధాని మోడీ ఏఐని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఇంటి

నుంచి ఒక ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) నిపుణుడు తయారు కావాలి. ఇది ప్రధాని మోడీ విజన్‌. ఢిల్లీలో ఉండే తెలుగు వాళ్లు ఇంటింటికీ వెళ్లి… ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని చెప్పాలి. సరైన సమయంలో సరైన నాయకుడు దేశాన్ని పాలిస్తున్నారు.

ప్రపంచ దేశాల్లో భారత్‌ పేరు మార్మోగుతున్నది. 2027 కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. దేశ రాజధాని ఢిల్లీ సమస్య వలయంలో చిక్కుకున్నది. ఇక్కడి ప్రజలు సరైన గాలి పీల్చాలంటే.. మోడీ ఆక్సిజన్‌ ఇవ్వాలి’ అని చంద్రబాబు అన్నారు.

Delhi Assembly Elections 2025,Andhra CM Chandrababu Naidu,Campaign for BJP,Delhi polls