2024-01-11 04:04:07.0
2024 Kia Sonet Facelift | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) తన ఫ్లాగ్‌షిప్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సోనెట్ 2024 ఫేస్‌లిఫ్ట్ (2024 Kia Sonet Facelift) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.
2024 Kia Sonet Facelift | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) తన ఫ్లాగ్‌షిప్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సోనెట్ 2024 ఫేస్‌లిఫ్ట్ (2024 Kia Sonet Facelift) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 12 (శుక్రవారం) వ తేదీన భారత్ మార్కెట్‌లో కియా సోనెట్-2024 ఫేస్‌లిఫ్ట్ (2024 Kia Sonet Facelift) ఆవిష్కరిస్తామని తెలిపింది. మూడు బ్రాడ్ ట్రిమ్స్, ఏడు వేరియంట్లలో లభిస్తుంది. రీఫ్రెష్డ్ ఎక్స్‌టీరియర్ డిజైన్, ఆకర్షణీయ ఫీచర్లతో వస్తోంది కియా సోనెట్ 2024 ఫేస్‌లిఫ్ట్ (2024 Kia Sonet Facelift). ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే డీలర్ల వద్దకు సోనెట్-2024 ఫేస్‌లిఫ్ట్ (2024 Kia Sonet Facelift) కార్లు వచ్చేశాయి. ఈ కారు ధర రూ.7.79 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. టాటా నెక్సాన్ (Tata Nexon), హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue), మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza), మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300), నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) వంటి కార్లతో కియా సోనెట్ 2024 ఫేస్‌లిప్ట్ పోటీ పడుతోంది.
కియా సోనెట్ 2024 ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారులో రీఫ్రెష్డ్ ఫేషియా, న్యూ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ తదితర డిజైన్లు జత కలిశాయి. డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సెమీ పవర్డ్ డ్రైవర్ సీట్, 360- డిగ్రీ కెమెరా, సేఫ్టీ కోసం అడాస్ వ్యవస్థ జత చేశారు.
న్యూ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్), ఫ్రంట్ కొల్లిషన్ అవాయిడెన్స్ అసిస్ట్ (ఎఫ్‌సీఏ), లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ (ఎల్‌వీడీఏ), లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ (ఎల్ఎఫ్ఏ) తదితర ఫీచర్లు జత కలిశాయి. అదనపు 15 – హెచ్ఐ సేఫ్టీ ఫీచర్లతోపాటు మొత్తం 25కి పైగా సేఫ్టీ ఫీచర్లతో జత చేసింది కియా ఇండియా. డ్యుయల్ స్క్రీన్ కనెక్టెడ్ ప్యానెల్ డిజైన్, రేర్ డోర్ సన్‌షేడ్ కర్టైన్, ఆల్ డోర్ పవర్ విండో వన్ టచ్ అప్ / డౌన్, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్ విత్ వైరస్ అండ్ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ ఫీచర్లు జత కలిపారు.
2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ (2024 Kia Sonet Facelift) ఎస్‌యూవీ మోడల్ కారు మూడు బ్రాడ్ ట్రిమ్స్ – టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్-లైన్‌ల్లో లభిస్తుంది. ఏడు వేరియంట్లతోపాటు ఐదు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. మూడు ఇంజిన్ ఆప్షన్లతో వస్తున్న కియా సోనెట్ 2024 ఫేస్‌లిఫ్ట్.. డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లో అందుబాటులో తిరిగి మార్కెట్లోకి వస్తోంది.
1.2 లీటర్ల నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (82 బీహెచ్పీ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్) విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 1.0 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (118 బీహెచ్పీ, 172 ఎన్ఎం టార్క్) విత్ 6-స్పీడ్ ఐఎంటీ లేదా 7-స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్, 1.5 లీటర్ల టర్బో ఇంజిన్ (114 బీహెచ్పీ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్) విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఐఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఇంజిన్ కలిగి ఉంటుంది.
1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అండ్ 18.83 కేఎంపీఎల్, 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అండ్ 18.70 కేఎంపీఎల్ / 7-స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ అండ్ 19.02 కేఎంపీఎల్, 1.5 లీటర్ల టర్బో డీజిల్ విత్ ఐఎంటీ ట్రాన్స్‌మిషన్ అండ్ 22.3 కేఎంపీఎల్ ఫ్యుయల్ ఎఫిషియెన్సీ లేదా 6-స్పీడ్ టార్క్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ విత్ 18.6 కేఎంపీఎల్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 2024 కారు ఫ్రంట్‌లో న్యూ బూమరాంగ్ షేప్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్స్, ఎల్ షేప్డ్ ప్యాటర్న్ డీఆర్ఎల్స్, బంపర్ కింద న్యూ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంతకుముందుతో పోలిస్తే సిగ్నేచర్ గ్రిల్లె స్వల్పంగా వెడల్పుగా, షార్పర్‌గా ఉంటుంది. ఎల్ఈడీ స్ట్రిప్ తోపాటు వెర్టికల్ టెయిల్ ల్యాంప్స్ కనెక్ట్ ఫీచర్ ఉంటుంది.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 2024 కారు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ట్విన్ 10.25 డిస్ ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, బిల్ట్ ఇన్ ఎయిర్ ప్యూరిఫయర్, 70+ కనెక్టెడ్ కారు ఫీచర్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రేర్ సన్ షేడ్స్, కనెక్టెడ్ కార్ టెక్ తదితర ఫీచర్లు జత చేశారు.
Kia Sonet,Kia India,2024 Kia Sonet,Kia Sonet Facelift