2024 Mahindra XUV700 | స‌రికొత్తగా ఆల్‌న్యూ నాపోలీ క‌ల‌ర్ ఆప్ష‌న్‌తో మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 700.. రూ.13.99 ల‌క్ష‌ల నుంచి షురూ..!

2024-01-16 02:48:37.0

2024 Mahindra XUV700 | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (ఎం అండ్ ఎం).. భార‌త్ మార్కెట్‌లోని త‌న 2024 అప్‌డేటెడ్‌ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 (2024 Mahindra XUV700) కారు ఆవిష్క‌రించింది.

2024 Mahindra XUV700 | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (ఎం అండ్ ఎం).. భార‌త్ మార్కెట్‌లోని త‌న 2024 అప్‌డేటెడ్‌ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 (2024 Mahindra XUV700) కారు ఆవిష్క‌రించింది. దీని ధ‌ర రూ.13.99 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది. 2024 మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 (2024 Mahindra XUV700) కారులో ఎక్స్‌టీరియ‌ర్‌, ఇంటీరియ‌ర్ అప్‌డేట్స్ అన్నీ న్యూ నాపోలీ బ్లాక్ క‌ల‌ర్ (Napoli Black) ఆప్ష‌న్‌లో ఉంటాయి. భార‌త్‌లోనే అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న ఎస్‌యూవీ కార్ల‌లో మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 ఒక‌టి. 2023లో ఈ కార్లు 74,434 యూనిట్లు అమ్ముడుకాగా, 2021 ఆగ‌స్టులో ఆవిష్క‌రించిన‌ప్ప‌టి నుంచి 1.40 ల‌క్ష‌ల‌కు పైగా కార్లు సేల్ అయ్యాయి.

2024 మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 (2024 Mahindra XUV700) కారు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 25క‌ల్లా డీల‌ర్ల వ‌ద్ద‌కు చేర‌తాయి. క‌స్ట‌మ‌ర్ల‌కు వేగంగా డెలివ‌రీ చేసేందుకు మ‌హీంద్రా తన ఉత్పాద‌క‌త సామ‌ర్థ్యం పెంచివేసింది. మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 కారు కొత్త‌గా నాపోలీ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో వ‌స్తుంది. ఇది బ్లాక్ రూఫ్ రెయిల్స్‌, బ్లాక్ గ్రిల్లె విత్ క్రోమ్ అస్సెంట్స్‌, బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. నాపోలీ బ్లాక్ రూఫ్‌తోపాటు ఆప్ష‌న‌ల్ డ్యుయ‌ల్ టోన్ క‌ల‌ర్ ఎంచుకోవ‌చ్చు. ఎఎక్స్‌7, ఏఎక్స్‌7ఎల్ వేరియంట్ల‌లో డార్క్ క్రోమ్ ఎయిర్ వెంట్స్‌, క‌న్సోల్ బెజెల్ ఉంటాయి.

2024 మ‌హీంద్రా ఎక్స్‌యూవీ (2024 Mahindra XUV700) ఎఎక్స్‌7, ఏఎక్స్‌7 ఎల్ వేరియంట్ల‌లో కెప్టెన్ సీట్లు ఆఫ‌ర్ చేస్తోంది. ఏఎక్స్‌7ఎల్ వేరియంట్‌లో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయి. మెమొరీ ఫంక్ష‌న్‌తోపాటు ఏఎక్స్‌7ఎల్‌లో మ‌హీంద్రా ఇంటిగ్రేటెడ్ ఔట్‌సైడ్ రేర్ వ్యూ మిర్ర‌ర్స్ జ‌త చేశారు.

2024 మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 700 (2024 Mahindra XUV700) కారు అడ్రెనోక్స్ సూట్ 13 అద‌న‌పు ఫీచ‌ర్లు క‌లిగి ఉంటడంతోపాటు మొత్తం 83 క‌నెక్టెడ్ కారు ఫీచ‌ర్లు ఉంటాయి. వాటిల్లో ఫర్మ్‌వేర్ ఓవ‌ర్ ది ఎయిర్ (ఫోటా) కేప‌బిలిటీస్‌, స‌ర్వీసింగ్‌పై స‌మ‌యానుకూలంగా అప్‌డేట్స్ ఇచ్చే ప్రోగ్నోసిస్ ఫీచ‌ర్‌, కాన్‌సీర్జ్ స‌ర్వీస్ కోసం ఆస్క్ మ‌హీంద్రా ఫీచ‌ర్ ఉంటాయి. అద‌నంగా ఎస్‌యూవీలో టెల్‌టాల్ లైట్స్‌, బ‌ట‌న్లు స్కాన్ చేయడానికి డ్రైవ‌ర్ల‌ను ఎం లెన్స్ ఫీచ‌ర్ అనుమ‌తిస్తుంది.

2024 మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 (2024 Mahindra XUV700) కారు ప్రోగ్నోసిస్ అల‌ర్ట్స్‌, వెహిక‌ల్ స్టేట‌స్‌, లొకేష‌న్ బేస్డ్ స‌ర్వీసెస్‌, సేఫ్టీ, రిమోట్ ఫంక్ష‌న్స్‌, థ‌ర్డ్ పార్టీ యాప్స్‌, నావెల్టీ క‌నెక్టెడ్ ఫీచ‌ర్లు ఉంటాయి. ఈ ఫీచ‌ర్లు ప‌ని చేయ‌డానికి యాక్టివ్ అడ్రెనోక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకోవాల్సి ఉంట‌ది.

2024 మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 700 (2024 Mahindra XUV700) కారు ఇంజిన్ 2.0 లీట‌ర్ పెట్రోల్‌, 2.2 లీట‌ర్ డీజిల్ ఇంజిన్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తుంది. పెట్రోల్ ఇంజిన్ 200 బీహెచ్‌పీ విద్యుత్‌, డీజిల్ ఇంజిన్ 155 బీహెచ్పీ లేదా 185 బీహెచ్పీ విద్యుత్ వెలువ‌రిస్తాయి. 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో వ‌స్తోంది. ఏడ‌బ్ల్యూడీ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌లో కూడా ల‌భిస్తుంది. 2024 మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 700 (2024 Mahindra XUV700) కారు ఆవిష్క‌ర‌ణ‌లో భాగంగా మెట్రో న‌గ‌రాల్లో ప్ర‌తి రెండు నెల‌లకోసారి వైట్ గ్లోవ్ చౌఫేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ నిర్వ‌హిస్తుంది. వాహ‌న ప‌నితీరుపై శిక్ష‌ణ ఇస్తుంది. తొలుత ఢిల్లీ, అహ్మ‌దాబాద్ న‌గ‌రాల్లో పైల‌ట్ ప్రాతిప‌దిక‌న శిక్ష‌ణ ఇస్తుంది. త‌దుప‌రి మిగ‌తా మెట్రో సిటీల‌కు విస్త‌రిస్తుంది.

వేరియంట్ వారీగా 2024 మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 కార్ల ధ‌ర‌లు

ఎఎక్స్ – రూ. 13.99 ల‌క్ష‌లు

ఎక్స్‌3 – రూ. 16.39 ల‌క్ష‌లు

ఏఎక్స్‌5 – రూ. 17.69 ల‌క్ష‌లు

ఏఎక్స్‌7 – రూ. 21.29 ల‌క్ష‌లు

ఏఎక్స్‌7L – రూ. 23.99 ల‌క్ష‌లు

Mahindra and Mahindra,Mahindra XUV700,2024 Mahindra,2024 Mahindra XUV700 price,2024 Mahindra XUV700 features,XUV 700 bookings,SUV