2024 Maruti Suzuki Swift | న్యూ 3-సిలిండ‌ర్ ఇంజిన్ కం సీవీటీ గేర్‌బాక్స్‌తో మ‌రింత స్పోర్టియ‌స్‌గా 2024-స్విఫ్ట్.. ఇవీ డిటైల్స్‌..!

https://www.teluguglobal.com/h-upload/2023/11/14/500x300_855735-swift-2024.webp
2023-11-14 02:39:46.0

2024 Maruti Suzuki Swift | దేశీయ కార్ల మార్కెట్‌లో అతి పెద్ద సంస్థ మారుతి సుజుకి. నిత్యం అందుబాటులోకి వ‌స్తున్న టెక్నాల‌జీని అంది పుచ్చుకుని, కార్ల ప్రేమికుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఫీచ‌ర్ల‌తో కొత్త మోడ‌ల్స్ తీసుకొస్తున్న‌ది.

2024 Maruti Suzuki Swift | దేశీయ కార్ల మార్కెట్‌లో అతి పెద్ద సంస్థ మారుతి సుజుకి. నిత్యం అందుబాటులోకి వ‌స్తున్న టెక్నాల‌జీని అంది పుచ్చుకుని, కార్ల ప్రేమికుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఫీచ‌ర్ల‌తో కొత్త మోడ‌ల్స్ తీసుకొస్తున్న‌ది. తాజాగా మ‌రో మోడ‌ల్ మార్కెట్లోకి తేనున్న‌ది. ఇటీవ‌ల జ‌రిగిన‌ జపాన్ మొబిలిటీ షోలో స‌రికొత్త కాన్సెప్ట్ కారును ఆవిష్క‌రించింది. అది ఫోర్త్ జ‌న‌రేష‌న్ సుజుకి స్విప్ట్ (Suzuki Swift). 2024 స్విఫ్ట్ (2024 Swift) మ‌రింత సొగ‌సుగా, స్పోర్టియ‌స్‌గా ఉంటుంది. సొగ‌సైన హెడ్ ల్యాంప్స్‌, రీ డిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్‌, ఆధునీక‌రించిన బంప‌ర్‌, లోవ‌ర్డ్ హైట్‌గా ఉంట‌ది. పూర్తిగా రిజైన్డ్ క్యాబిన్‌, లేయ‌ర్డ్ లుక్ డాష్‌బోర్డ్‌, ఫ్రీ స్టాండింగ్ 9-అంగుళాల ట‌చ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, పుష్ స్టార్ట్ లేదా స్టాప్ బ‌ట‌న్‌, క‌ల‌ర్ ఎంఐడీ, ఫ్యాబ్రిక్ సీట్ క‌వ‌ర్స్ విత్ జియో మెట్రిక్ ప్యాట్ర‌న్స్ తదిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి. సుజుకి స్విఫ్ట్ రెండు ఇంజిన్ ఆప్ష‌న్ల‌లో మార్కెట్ల‌లోకి వ‌స్తున్న‌ది.

ఇలా 2024 – స్విఫ్ట్ ఇంజిన్ ఆప్ష‌న్లు

1.2 లీట‌ర్ల, 3-సిలిండ‌ర్ పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తోంది స్విఫ్ట్ 2024 కాన్సెప్ట్‌. జ‌డ్‌12ఈ టైప్ 1.2-లీట‌ర్, 3- సిలిండ‌ర్ పెట్రోల్ ఇంజిన్ క‌లిగి ఉంటుందీ స్విప్ట్ 2024. ఈ ఇంజిన్ సాయంతో తేలిగ్గా న‌గ‌రంలో డ్రైవింగ్ చేయ‌డానికి స‌రిప‌డా లో-ఎండ్ టార్క్ ఉత్ప‌త్తి చేస్తుంది. గుడ్ ఎఫిషియెన్సీ, డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప‌ని చేసేలా రూపుదిద్దుకుంటున్న‌ది. 2డ‌బ్ల్యూడీ, ఫుల్ టైం 4డ‌బ్ల్యూడీ ఆప్ష‌న్ల‌తో స్విఫ్ట్‌-2024 కాన్సెప్ట్ కారుతో వ‌స్తుంది. సీవీటీ ట్రాన్స్‌మిష‌న్ వేరియంట్‌తో 2డ‌బ్ల్యూడీ, ఫుల్ టైం 4డ‌బ్ల్యూడీ ఆప్ష‌న్ల ఇంజిన్లు వ‌స్తాయి.

వీటికి తోడు 2024-స్విఫ్ట్ కారు 3-సిలిండ‌ర్ ఇంజిన్‌తో 1.2 లీట‌ర్ల మైల్డ్ హైబ్రీడ్ ఇంజిన్ క‌లిగి ఉంటుంది. శ‌క్తి త‌గ్గుతున్న‌ప్పుడు ఉత్ప‌త్తి చేయ‌డానికి వీలుగా బ్యాట‌రీ చార్జింగ్ డెడికేట్ చేసిన‌ హై ఎఫిషియెంట్ ఐఎస్జీ (జ‌న‌రేట‌ర్ విత్ మోటార్ ఫంక్ష‌న్‌)తో కూడిన విద్యుత్ మోటార్ ఉంటుంది. కారు వేగం పుంజుకుంటున్న‌ప్పుడు విద్యుత్ మోటార్‌తోపాటు ఇంజిన్‌కు ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ సాయం ప‌డుతుంది. ఇంధ‌న వినియోగాన్ని త‌గ్గింపు, అధిక ఫ్యుయ‌ల్ ఎఫిషియెన్సీ సాధించ‌డానికి వెసులుబాటు క‌లుగుతుంది.

1.2 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్‌తో శ‌క్తిమంత‌మైన హైబ్రీడ్ వ‌ర్ష‌న్‌తో కూడిన స్విఫ్ట్‌-2024 భార‌త్ మార్కెట్‌లోకి వ‌స్తోంది. మెరుగైన ఫ్యుయ‌ల్ ఎకాన‌మీ సాధించేందుకు 48 వాట్ల ఎల‌క్ట్రిక్ మోటార్ కారుతో గంట‌కు లీట‌ర్‌పై 30 కి.మీ మైలేజీ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. జ‌పాన్ వ‌ర్ష‌న్‌తో పోలిస్తే ఇండియా వ‌ర్ష‌న్ స్విఫ్ట్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, స్టాండ‌ర్డ్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రీడ్ వ‌ర్ష‌న్‌తో వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

2024-స్విఫ్ట్ ఫీచ‌ర్లు ఇలా

మారుతి సుజుకి (Maruti Suzuki) తన న్యూ హ్యాచ్‌బ్యాక్ (hatchback) మోడ‌ల్ కారు స్విఫ్ట్ (Swift)లో ఇంటీరియ‌ర్ డిజైన్ చేస్తుంది. మూడు ర‌కాల సెన్స‌ర్లు – మిల్లీమీట‌ర్‌-వేవ్ రాడ‌ర్ (millimeter-wave radar), మోనోక్యుల‌ర్ కెమెరా (monocular camera), ఆల్ట్రాసోనిక్ సెన్స‌ర్ (ultrasonic sensor) ఉంటాయి. కారులో వెళుతున్న‌ప్పుడు మార్గం, ల‌క్ష్యం గుర్తింపు విస్త‌ర‌ణ (detection area and target), ప‌నితీరు, భ‌ద్ర‌త మెరుగుదల‌కు ఈ సెన్స‌ర్లు ఉప‌క‌రిస్తాయి. డ్రైవ‌ర్ మానిట‌రింగ్ సిస్ట‌మ్ (Driver Monitoring system), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (Adaptive Cruise Control), డ్యుయ‌ల్ సెన్స‌ర్ బ్రేక్ స‌పోర్ట్ (Dual Sensor Brake Support), త‌క్కువ వేగంతో వెళుతున్న‌ప్పుడు బ్రేక్ స‌పోర్ట్ (Brake Support at Low Speeds), సైన్ రిక‌గ్నిష‌న్ ఫంక్ష‌న్ (Sign Recognition function), లేన్ కీప్ అసిస్ట్ (Lane Keep Assist), లేన్ డిపార్చ‌ర్ వార్నింగ్ (Lane Departure Warning), బ్లైండ్ స్పాట్ మానిట‌ర్ (blind spot monitor), రేర్ క్రాస్ ట్రాఫిక్ అల‌ర్ట్ (rear cross-traffic alert), స్టార్ట్ నోటిఫికేష‌న్ ఫంక్ష‌న్ (start notification function), ఓమ్నీ డైరెక్ష‌న‌ల్ మానిట‌ర్ కెమెరా (Omnidirectional monitor camera), స్టాగ‌ర్ అలార‌మ్ ఫంక్ష‌న్ (stagger alarm function), హై బీమ్ అసిస్ట్ (high beam assist) త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి. జ‌పాన్‌లో సుజుకి మోటార్స్ ఆవిష్క‌రించే 2024- స్విఫ్ట్ ((2024 Swift) కారులో అన్ని ఫీచ‌ర్లు ఉన్నా.. భార‌త్ వ‌ర్ష‌న్ కారులో కొన్ని ఫీచ‌ర్లు మిస్ కావ‌చ్చున‌ని భావిస్తున్నారు.

Maruti Suzuki,Maruti Suzuki Swift,Maruti Suzuki Swift 2024,Cars
Maruti Suzuki New Swift, Maruti Suzuki Swift, Maruti Suzuki Swift 2024, New cars, News, Business, Business News, New Cars

https://www.teluguglobal.com//business/2024-maruti-suzuki-swift-to-come-with-new-3-cylinder-engine-cvt-gearbox-check-details-974051