2024 Top 5-SUVs | హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ టు టాటా కర్వ్‌.. 2024లో మార్కెట్‌లోకి వ‌చ్చే ఎస్‌యూవీ కార్లివే..!

https://www.teluguglobal.com/h-upload/2023/11/01/500x300_849555-tata-curvv.webp
2023-11-01 13:00:42.0

2024 Top 5-SUVs | మారుతి సుజుకి ఇండియా, హ్యుండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, కియా ఇండియా, ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్ సంస్థ‌లు దేశీయ మార్కెట్‌లో ఎస్‌యూవీల‌కు మంచి గిరాకీ ఉంది.

2024 Top 5-SUVs | రోజురోజుకు భార‌త్‌లో ఎస్‌యూవీ కార్ల‌కు క్రేజ్ పెరుగుతోంది. ప్ర‌స్తుతం దేశంలో అమ్ముడ‌వుతున్న ప్ర‌తి రెండు కార్ల‌లో ఒక‌టి ఎస్‌యూవీ. మారుతి సుజుకి ఇండియా, హ్యుండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, కియా ఇండియా, ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్ సంస్థ‌లు దేశీయ మార్కెట్‌లో ఎస్‌యూవీల‌కు మంచి గిరాకీ ఉంది. వీటిల్లో కొన్ని సంస్థ‌లు వ‌చ్చే ఏడాది కొత్త మోడ‌ల్ ఎస్‌యూవీ కార్లు విక్ర‌యిస్తున్నాయి. 2024లో వ‌చ్చే ఐదు ప్ర‌ముఖ ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందామా..!

2024 హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌

2024 జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికంలో హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) త‌న ఎస్‌యూవీ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (Creta facelift) ఆవిష్క‌రించ‌నున్న‌ది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), కియా సెల్టోస్ (Kia Seltos) త‌దిత‌ర పాపుల‌ర్ ఎస్‌యూవీల‌కు గట్టి పోటీ ఇవ్వ‌నున్న‌ది క్రెటా ఫేస్‌లిఫ్ట్ (Creta facelift). ప్ర‌స్తుతం దేశీయ మార్కెట్లో మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న మోడ‌ల్ కారు హ్యుండాయ్ క్రెటా. 2024 హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ ప‌లు ఎక్స్‌టీరియ‌ర్‌, ఇంటీరియ‌ర్ అప్‌డేట్స్‌తో వ‌స్తోంది. అద‌నంగా అడ్వాన్స్‌డ్ డ్రైవ‌ర్ అసిస్టెన్స్ సిస్ట‌మ్ (అడాస్‌) క‌లిగి ఉంటుంది. కియా సెల్టోస్‌ (Kia Seltos) లో మాదిరిగా 1.5 లీట‌ర్ల ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్ జ‌త చేశారు.

తొలి అర్థ‌భాగంలో కియా సొనెట్ ఫేస్‌లిఫ్ట్‌

ద‌క్షిణ కొరియాకు చెందిన ఆటో మేజ‌ర్ కియా ఇండియా (Kia India) – 2024 తొలి అర్థ‌భాగంలో త‌న ఎస్‌యూవీ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ (kia Sonet facelift) ఆవిష్క‌రించ‌నున్న‌ది. ప్ర‌స్తుతం దేశంలో అమ్ముడ‌వుతున్న స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ (Sub-4 Meter Compact SUV)ల్లో ఒక‌టి కియా సొనెట్‌ (Kia Sonet). గ‌త కొన్ని నెల‌లుగా దేశంలో కియా సొనెట్ (Kia Sonet) కారు ఎక్కువ‌గా అమ్ముడు అవుతుంది. అప్‌డేటెడ్ సొనెట్ ఫేస్‌లిఫ్ట్‌ (Kia Sonet Face lift) ను ఇప్ప‌టికే భార‌త్‌లో టెస్టింగ్ చేశారు. బోల్డ్ సేఫ్టీ ఫీచ‌ర్లతో లోడ్ చేసిన కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. కొత్త అవ‌తార్‌లోనూ సోనెట్ ఫేస్‌లిఫ్ట్ (Kia Sonet Face lift) ఇంటీరియ‌ర్‌గా, ఎక్స్‌టీరియ‌ర్‌గా ప‌లు మార్పుల‌తో వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

వ‌చ్చే ఏడాది మ‌హీంద్రా 5-డోర్ థార్ ఆవిష్క‌ర‌ణ‌

భార‌తీయులంతా ఆస‌క్తిగా మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) డెవ‌ల‌ప్ చేసిన 5-డోర్ థార్ (Mahindra Thar 5-door) కారు కోసం ఎదురుచూస్తున్నారు. 2024లో 5-డోర్ మ‌హీంద్రా (Mahindra Thar 5-door) ఆవిష్క‌రిస్తామ‌ని ఇప్ప‌టికే మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు థార్‌-5 డోర్ కారు టెస్టింగ్ పూర్తి చేసుకున్న‌ది. ఎల‌క్ట్రిక్ స‌న్‌రూఫ్‌తోపాటు ప‌లు కొత్త సేఫ్టీ, బెట‌ర్‌ ఫీచ‌ర్ల‌తో అందుబాటులోకి రానున్న‌ది.

సెవెన్ సీట‌ర్ల‌తో మైక్రో ఎస్‌యూవీ మోడల్ టాటా క‌ర్వ్‌

దేశీయ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki), హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) సంస్థ‌ల‌తో పోటీ ప‌డుతోంది టాటా మోటార్స్‌. ఎల‌క్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మొద‌టిస్థానంలో కొన‌సాగుతున్న టాటా మోటార్స్‌ (Tata Motors). సంప్ర‌దాయ కార్ల మార్కెట్‌లోనూ మిగ‌తా సంస్థ‌ల‌తో త‌ల ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతోంది. త‌ద్వారా హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), కియా సెల్టోస్ (Kia Seltos) త‌దిత‌ర మోడ‌ల్ కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు టాటా మోటార్స్ (Tata Motors) సిద్ధ‌మైంది. అందులో భాగంగా టాటా మోటార్స్ టాటా క‌ర్వ్ (Tata Curvv).. 2024లో మార్కెట్‌లో ఆవిష్క‌రిస్తామ‌ని తెలిపింది. ఇప్ప‌టికే టాటా మోటార్స్ (Tata Motors).. పంచ్ (Punch), నెక్సాన్‌ (Nexon), హారియ‌ర్‌ (Harrier), స‌ఫారీ (Safari) వంటి ఎస్‌యూవీ కార్లు విక్ర‌యిస్తోంది. మైక్రో-ఎస్‌యూవీ (Micro-SUV) క్యాట‌గిరీలో ఏడు సీట‌ర్ల‌తో టాటా క‌ర్వ్‌ (Tata Currv) ఆవిష్క‌ర‌ణ‌తో టాటా మోటార్స్ కార్ల మార్కెట్‌లో పురోభివృద్ధి సాధించ‌నున్న‌ది.

5-డోర్ థార్‌తోపాటు ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ కూడా

దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra and Mahindra).. 5-డోర్ థార్ (Thar 5-Door) కారుతోపాటు వ‌చ్చే ఏడాది ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ (XUV 300) మార్కెట్‌లోకి ఆవిష్క‌రించ‌నున్న‌ది. గ్లోబ‌ల్ ఎన్‌-క్యాప్ టెస్టింగ్‌ (Global N-Cap Testing)లో ఎక్స్‌యూవీ 300 (XUV 300) కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకున్న‌ది. ఇత‌ర కార్ల త‌యారీ సంస్థ‌ల‌తో పోలిస్తే ప‌లు ఫీచ‌ర్ల‌తో పోటీగా వ‌స్తోంది మ‌హీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌ (Mahindra XUV 300 Facelift).

Top SUV cars,SUV,Cars,Top 5 SUV Cars in 2024,Tata Curvv
2024 Top 5 SUVs, Top SUV cars, Top 5 SUV Cars, Top 5 SUV Cars in 2024, upcoming, upcoming suv in india 2024, Tata Curvv

https://www.teluguglobal.com//business/2024-top-5-suvs-from-hyundai-creta-facelift-to-tata-curvv-here-are-5-upcoming-suvs-in-india-in-2024-971431