2024-12-31 14:19:08.0
శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్
ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని సూచించారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
నేడు పార్టీ క్యాలెండర్ ఆవిష్కర
బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన 2025 క్యాలెండర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి తెలంగాణ భవన్ లో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని ఒక ప్రకటనలో తెలిపారు.
New Year,KCR,BRS,KTR,Wishes to People