2028లో బీఆర్‌ఎస్ పార్టీదే అధికారం : కేటీఆర్

2025-01-31 12:04:20.0

సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు మురికి కూపాలుగా ఉండేవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

2028లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మున్సిపల్ చైర్‌పర్సన్‌ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్‌, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్‌ పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్‌తో పని చేయాలని దిశా నిర్దేశం చేశారన్నారు. అందుకే ఆర్థిక ఇంజిన్లుగా ఉన్న పట్టణాలను, వాటిని సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పట్టణీకరణ ఆపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయన్నారు. పట్టాణాల విస్తరణ ఆపడం వీలు కాదు.. కానీ ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మాత్రం అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఆ దిశగా పదేళ్లు పనిచేశామన్నారు. చేసిన పనిని అభివృద్ధి నివేదికల రూపంలో ప్రజల ముందుంచామన్నారు.

సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు మురికి కూపాలుగా ఉండేవని.. బల్దియాలు అంటే ఖాయా.. పియా.. చల్దియా.. అనే సామెత ఉండేది కేటీఆర్ అన్నారు.10 యేండ్లలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నాం. బిఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం.700 కోట్లతో నల్లగొండను అభివృద్ది చేసుకున్నామని తెలిపారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది. 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలలగా జీతాలు రావడం లేదు. సూర్యాపేట మున్సిపల్ ఛైర్మెన్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం ఇచ్చాం. టకీ టకీమని డిల్లీలో పైసలు పడుతున్నాయి తప్పా.. రైతుల అకౌంట్స్ లో మాత్రం పడడంలేదు. పదవి కాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మన్ లు ప్రజల్లోనే ఉంటే తిరిగి ప్రజలే గెలిపిస్తారని కేటీఆర్ తెలిపారు.

KCR,BRS Party,CM Revanth reddy,Congress party,Raitu bandhu,Telangana People,Dalit bandhu,KTR,Municipal Chairperson,Municipalities,Develop comprehensively,Raitu bharosa,Ration cards,Minister Komati Reddy Venkata Reddy