2028 డిసెంబర్‌ వరకు ఉచిత రేషన్‌

2024-10-09 11:48:17.0

కేంద్ర కేబినెట్‌ భేటీలో నిర్ణయం

https://www.teluguglobal.com/h-upload/2024/10/09/1367631-free-ration.webp

దేశంలోని పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు 2028 డిసెంబర్‌ నెల వరకు ఉచిత రేషన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తూ బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయబోతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజస్థాన్‌, పంజాబ్‌ సరిహద్దుల్లో రూ.4,406 కోట్లతో 2,280 కి.మీ.ల పొడవైన రోడ్డు నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. గుజరాత్‌ లోని లోథాల్‌ నేషనల్‌ మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌ అభివృద్ధికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Free Ration,PMGKAY,up to 2028 december,union cabinet decision