2023-07-23 03:13:46.0
అతను 210 కిలోల బరువున్న బార్బెల్‌ను భుజాలపై పెట్టుకుని కసరత్తు మొదలుపెట్టాడు. అతనితో పాటు అతని సహాయకుడు కూడా అక్కడే ఉన్నాడు.
అతనో ఫిట్‌నెస్ ట్రైనర్. జిమ్‌లో కసరత్తు చేస్తున్న సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 210 కిలోల బార్బెల్‌తో కసరత్తు చేస్తున్న సమయంలో అది కాస్తా పొరపాటున అతని మెడపై పడింది. దీంతో మెడ విరిగిపోయింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా అతని ప్రాణాలు నిలబడలేదు. ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇండోనేషియాకు చెందిన వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరున్న జస్టిన్ విక్కీ (33) ఎప్పటిలాగానే బాలిలోని ఓ జిమ్‌లో వ్యాయామానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతను 210 కిలోల బరువున్న బార్బెల్‌ను భుజాలపై పెట్టుకుని కసరత్తు మొదలుపెట్టాడు. అతనితో పాటు అతని సహాయకుడు కూడా అక్కడే ఉన్నాడు. కసరత్తు చేస్తున్న క్రమంలో అతను బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆ బార్బెల్ కాస్తా.. అతని మెడపై పడిపోయింది.
దీంతో వెంటనే అతని మెడ విరిగిపోయి.. అక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోయింది. అతను కొద్దిసేపటికే మృతిచెందాడు. ప్రమాదం కారణంగా మెడ విరిగిపోవడంతోపాటు గుండె, ఊపిరితిత్తులను అనుసంధానించే కీలక నరాలు దెబ్బతినడంతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
Fitness Trainer,Justyn Vicky,Dies,210 kg weight,Neck,Indonesia,Bali