27న ఏడు ఉమ్మడి జిల్లాల ఉద్యోగులకు సెలవు

2025-02-21 12:59:52.0

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ నేపథ్యంలో ప్రకటించిన ప్రభుత్వం

గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఈనెల 27న ఏడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కరీంనగర్‌ – ఆదిలాబాద్‌ – నిజామాబాద్‌ – మెదక్‌ గ్రాడ్యుయేట్స్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, వరంగల్‌ – నల్గొండ – ఖమ్మం టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి 27న పోలింగ్‌ జరగనుంది. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో ఓటర్లుగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీఈవో ఆదేశాల మేరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆయా జిల్లాల్లోని ప్రైవేట్‌ ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొనేలా ఆయా సంస్థలు, యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులు ఓటు వేసేలా షిఫ్టులు సర్దుబాటు చేయాలని సూచించింది.

MLC Elections,Graduates,Teachers Constituencies,Seven Former Districts,Poling Day,27th February