30 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు

https://www.teluguglobal.com/h-upload/2024/10/23/1371599-accident.webp

2024-10-23 03:49:34.0

ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. 

RTC bus fell,30 feet valley,20 passengers injured,Two are serious,Pulivendula,Kadiri