2025-03-02 10:34:17.0
నిలకడగా ఆడుతున్న శ్రేయాస్, అక్షర్ పటేల్
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ (2) రన్స్‌కే వెనుదిరిగాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో (2.4 వ ఓవర్) ఎల్బీ అయ్యాడు. డీఆర్‌ఎస్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో 15 రన్స్ వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఇక అప్పటివరకు దూకుడుగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (15) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు. జెమీసన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించాడు. విలియంగ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. దీంతో 22 రన్స్ వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కెరీర్‌లో 330 వన్డే ఆడిన విరాట్ కోహ్లీ కూడా స్వల్ప స్కోర్‌కే ఔట్ కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. వేగంగా ఆడే క్రమంలో విరాట్ (11) బ్యాక్‌వర్గ్ పాయింట్‌లో గ్లేన్ పిలిప్స్ సూపర్ క్యాచ్ పట్టడంతో స్టన్ అవడం కోహ్లీ వంతు అయ్యింది. దీంతో 30 రన్స్‌కే భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు భారత్ 30/ 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో ఉన్న శ్రేయాస్, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడుతున్నారు. కివీస్ బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో రన్స్ రావడం కష్టంగా మారింది. 21 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 84/3. శ్రేయాస్ అయ్యర్ (33*) అక్షర్ పటేల్ (21*) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.
India vs New Zealand,12th Match,Group A at Dubai,Champions Trophy,Shreyas Santosh Iyer,Axar Rajeshbhai Patel