35 Chinna Katha Kaadu | రానా సినిమాకు మరో రిలీజ్ డేట్

 

2024-08-26 04:17:15.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/26/1354752-35-chinna-katha-kaadu.webp

35 Chinna Katha Kaadu – లెక్క ప్రకారం ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ చిన్న సినిమాకు ఇప్పుడు కొత్త విడుదల తేదీ ఖరారు చేశారు.

“35 చిన్న కథ కాదు” అనే చిన్న సినిమా టీజర్ తో ఆసక్తిని రేకెత్తించింది. లెక్కప్రకారం ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంటుంది. కానీ డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాల రాకతో, ఈ చిన్న సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు, చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది.

“35 చిన్న కథ కాదు” సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇది తెలుగు, తమిళం, మలయాళంలో ఏకకాలంలో విడుదల కానుంది.

నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ డ్రామా చిత్రమిది. నంద కిషోర్ ఈమని ఈ చిత్రానికి రచన-దర్శకత్వం వహించగా, రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి కలిసి నిర్మించారు.

కొంతమంది సినీ ప్రముఖులకు, సినిమా ఫీల్డ్ తో సంబంధం లేని మరికొంతమందికి ఈ సినిమాను ప్రత్యేకంగా చూపించారు. వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని కొన్ని మార్పుచేర్పులు చేశారు. సినిమా బాగా వచ్చిందంటున్నాడు నిర్మాత రానా.

 

Rana,35 Chinna Katha Kaadu,new release date,Priyadarshi