8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

2025-01-16 10:11:31.0

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు

https://www.teluguglobal.com/h-upload/2025/01/16/1394969-pm-modi123.webp

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర క్యాబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్రోలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో వేతన సంఘం చైర్మన్‌ నియామించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్‌ ప్యాడ్‌ను నిర్మించనున్నారు. ఎన్‌జీఎల్‌వీ ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎన్‌జీఎల్‌వీ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.

PM Narendra Modi,ISRO,Union Minister Ashwini Vaishnav,8th Pay Commission,NGLV experiments