https://www.teluguglobal.com/h-upload/old_images/500x300_306403-good-news-ration-card-holders.webp
2022-07-06 22:05:54.0
రాష్ట్రంలోని రేషన్ కార్డు హోల్డర్స్ కు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. వచ్చే నెల నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఆగస్టు నెలలో ఒక్కొక్కరికీ 15 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని వల్ల రాష్ట్రంలోని సుమారు 76 లక్షల మంది తెల్ల రేషన్‌కార్డుల లబ్దిదార్లకు ప్రయోజనం కలగనున్నది. రేషన్‌కార్డు లబ్ధిదారులకు వచ్చే నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం […]
రాష్ట్రంలోని రేషన్ కార్డు హోల్డర్స్ కు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. వచ్చే నెల నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఆగస్టు నెలలో ఒక్కొక్కరికీ 15 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని వల్ల రాష్ట్రంలోని సుమారు 76 లక్షల మంది తెల్ల రేషన్‌కార్డుల లబ్దిదార్లకు ప్రయోజనం కలగనున్నది.
రేషన్‌కార్డు లబ్ధిదారులకు వచ్చే నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం కింద కరోనా సంక్షోభం నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మే నెలలో ఈ ఉచిత బియ్యం పంపిణీని పూర్తిగా ఎత్తివేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆగస్టులో ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
government,Ration Card,Telangana,Telangana Ration Card,TSR
https://www.teluguglobal.com//2022/07/07/telangana-government-sweet-news-for-ration-card-holders/