https://www.teluguglobal.com/h-upload/2024/03/15/500x300_1306983-fruits.webp
2024-03-17 03:13:04.0
సీజనల్‌గా పండే పండ్లు, కాయగూరల్లో ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి.
సీజన్‌ను బట్టి డైట్లో తగిన మార్పులు చేసుకోవడం వల్ల సీజనల్‌గా వచ్చే సమస్యల నుంచి బయటపడొచ్చు. సమ్మర్లో వచ్చే రకరకాల సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని ముఖ్యమైన సీజనల్ ఫుడ్స్‌ను డైట్లో చేర్చుకోవాలి.
సీజన్ ప్రకారం పంట వచ్చే పండ్లు, కాయగూరలన్నీ ఆయా సీజన్లలో తినదగినవిగా ఉంటాయి. పైగా ఇలా పండే పంటలకు రసాయనాల అవసరం కూడా ఉండదు. కాబట్టి సీజనల్ ఫుడ్స్ అనేవి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సీజనల్‌గా పండే పండ్లు, కాయగూరల్లో ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఆయా సీజన్లలో వచ్చే సమస్యలకు అవి మెడిసిన్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా సమ్మర్లో డీహైడ్రేషన్, వేడి చేయడం, ఇమ్యూనిటీ తగ్గడం, వడదెబ్బ వంటి సమస్యలు రాకుండా ఏమేం సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలంటే..
సమ్మర్ వస్తే రోడ్ల మీద పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో 90 శాతం నీరే ఉంటుంది. కాబట్టి ఇది సమ్మర్లో బెస్ట్ సీజనల్ ఫ్రూట్. రోజూ పుచ్ఛకాయ తినడం ద్వారా సమ్మర్లో డీహ్రేషన్ జరగకుండా ఉంటుంది. శరీరంలో వేడి తగ్గుతుంది.
సమ్మర్లో దొరికే మరో స్పెషల్ ఫ్రూట్ మామిడి. మామిడి పండులో విటమిన్ ‘ఏ’, విటమిన్ ‘ఇ’ తోపాటు మినరల్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. సమ్మర్లో మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ తగ్గకుండా చూసుకోవచ్చు.
సమ్మర్లో పైనాపిల్ పండ్లు కూడా విరివిగా లభిస్తుంటాయి. ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫ్లమేషన్ను తగ్గించే ఈ ఫ్రూట్‌ను సమ్మర్ సీజన్లో తప్పక తీసుకోవాలి. అలాగే కర్భూజా పండ్లు కూడా ఈ సీజన్లో ఎక్కువే. ఇవి కూడా డైలీ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తాయి.
ఇక కాయగూరల విషయానికొస్తే ఈ సీజన్లో క్యారెట్లు, దొండకాయలు, పాలకూర వంటివి ఎక్కువగా పండుతుంటాయి. వీటిలో దొండకాయల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తప్పక తీసుకోవాలి. ఇక పాలకూర, క్యారెట్.. రోజువారీ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీ పెంచడంలో సాయపడతాయి.
Summer,Seasonal Foods,Food,Health Tips,Summer Season Fruits,Fruits
summer, seasonal foods, Health, news, telugu news, telugu global news, Summer Season Fruits
https://www.teluguglobal.com//health-life-style/what-to-eat-in-summer-these-are-seasonal-foods-1011601