సీజన్ మారితే వచ్చే డిప్రెషన్ గురించి తెలుసా?

https://www.teluguglobal.com/h-upload/2023/12/05/500x300_867087-seasonal-depression.webp
2023-12-05 10:58:22.0

సీజన్ మారితే వాతావరణంలోనే కాదు, మనిషి ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయంటున్నారు డాక్టర్లు. దీన్నే సీజనల్ డిప్రెషన్ లేదా ‘సీజనల్ ఎఫెక్టివ్​ డిజార్డర్(ఎస్ఏడీ)’ అంటారు.

సీజన్ మారితే వాతావరణంలోనే కాదు, మనిషి ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయంటున్నారు డాక్టర్లు. దీన్నే సీజనల్ డిప్రెషన్ లేదా ‘సీజనల్ ఎఫెక్టివ్​ డిజార్డర్(ఎస్ఏడీ)’ అంటారు. ఈ తరహా డిప్రెషన్ చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇదెలా ఉంటుందంటే..

సీజన్ మారడం వల్ల కామన్ వచ్చే డిప్రెషన్‌ను సీజనల్ డిప్రెషన్ అంటారు. ఇది వింటర్‌‌లో ఎక్కువ. అందుకే దీన్ని ‘వింటర్ బ్లూస్’ అని కూడా అంటుంటారు. సాధారణంగా శరీరం పాటించే బయో క్లాక్‌లో మార్పులొచ్చినప్పుడు హార్మోన్ లెవల్స్ తగ్గి ప్రవర్తనలో మార్పులొస్తాయి. ఉదయాన్నే నిద్ర లేవడం నుంచి రాత్రి పడుకునేవరకు ఉండే టైం టేబుల్, డైట్.. ఇలాంటివి వింటర్‌‌లో కాస్త మారుతుంటాయి. దీనివల్ల బయో క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. తద్వారా సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్స్ తగ్గుతాయి. ఈ కారణం చేత చలికాలంలో కొంతమందికి డిప్రెస్డ్‌గా అనిపిస్తుంది. దీంతోపాటు వ్యాయామం చేయకపోవడం, విటమిన్–డి లోపించడం కూడా ఈ తరహా డిప్రెషన్‌కు కారణాలు.

ఎవరికి వస్తుందంటే..

ఇప్పటికే ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్న వాళ్లు, ఇతర మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు సీజనల్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ముప్ఫై ఏళ్లలోపు వ్యక్తులకు ఈ తరహా డిప్రెషన్ వస్తుంటుంది. కొంతమందిలో వారసత్వంగా కూడా రావొచ్చు. కారణం లేకుండానే బాధగా అనిపించడం, ఒత్తిడి, నీరసం, ఎకాగ్రత లోపించడం వంటివి సీఏడీ లక్షణాలు.

జాగ్రత్తలు ఇలా..

సీజనల్ డిప్రెషన్ సీజన్‌తో పాటే ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. అంటే వింటర్ పోయి సమ్మర్ వచ్చే టైంకి హార్మోన్ లెవల్స్ మారిపోతాయి. కానీ, డిప్రెషన్ వల్ల కొంతమంది కుంగిపోతారు. ఆ ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

డిప్రెషన్‌గా అనిపిస్తున్నవాళ్లు రోజూ టైంకి తినడం, వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజూ ఒకే టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఒకే టైంకి నిద్ర పోవాలి. హెల్దీ డైట్ తీసుకోవాలి. ఒంటరిగా ఉండకుండా మనుషులతో కలుస్తుండాలి. డిప్రెషన్ మరీ ఎక్కువైతే డాక్టర్ సలహా తీసుకోవచ్చు.

Seasonal Depression,Winter Blues,Depression
Seasonal affective disorder, seasonal depression, winter blues, Health, Telugu News, Telugu Global News, Latest Telugu News, depression, వింటర్, డిప్రెషన్

https://www.teluguglobal.com//health-life-style/do-you-know-about-seasonal-depression-978837