https://www.teluguglobal.com/h-upload/2023/11/28/500x300_863067-stuffy-nose.webp
2023-11-29 02:59:15.0
ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది మందులు వాడుతూ ఉంటారు. అయితే, వీటి కారణంగా కొన్ని సైడ్‌ఎఫెక్స్ వచ్చే అవకాశం ఉంది. సింపుల్ హోంరెమిడీస్ ముక్కుదిబ్బడను దూరం చేయడానికి, శ్వాస సరిగ్గా ఆడటానికి సహాయపడతాయి.
జలుబు, తలనొప్పి , ఈ రెండు పదాలు వినగానే మనకి వచ్చే తరువాత పదం ముక్కు దిబ్బడే.. నిజానికి ఈ కాలంలో మనల్ని ఎక్కువగా ఇబ్బందిపెట్టేది కూడా ఇదే. వాతావరణంలో మార్పులు కారణంగా జలుబుతో పాటు ముక్కుదిబ్బడ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ముక్కు మూసుకొని పోయి.. ఊపిరి అందక, నిద్ర పట్టనివ్వక చాలా ఇబ్బంది పెడుతుంది. ముక్కులో ఉండే అతి సున్నిత త్వచాలు ఉబ్బడంతో ముక్కు మూసుకుపోయిన భావన కలుగుతుంది. దాంతో ముక్కును బలంగా చీదుతూ ఉండటంతో మరింత వాచిపోతుంది. అలాగే నీరు కూడా కారుతూ మనకు మరింత ఇరిటేషన్‌ను కలుగజేస్తుంది. కొందరిలో జలుబు కనిపించదు. కానీ ముక్కు దిబ్బడ మాత్రం ఉంటుంది.
ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది మందులు వాడుతూ ఉంటారు. అయితే, వీటి కారణంగా కొన్ని సైడ్‌ఎఫెక్స్ వచ్చే అవకాశం ఉంది. సింపుల్ హోంరెమిడీస్ ముక్కుదిబ్బడను దూరం చేయడానికి, శ్వాస సరిగ్గా ఆడటానికి సహాయపడతాయి. అవేంటో చూద్దాం.
ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడేవారు వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ముక్కు క్లియర్ అవుతుంది. అంతేకాకుండా జలుబు సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. యూకలిప్టస్ ఆయిల్ రెండు, మూడు చుక్కలను వేడి నీటిలో వేయటం, మరిగించిన నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకొని పీల్చినా కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటివాటి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
మీరు ముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతుంటే.. నీరు ఎక్కువగా తాగండి. గోరువెచ్చని నీళ్లు, హెర్బల్ టీలు తాగితే.. ముక్కు ఫ్రీ అవుతుంది. ముక్కుదిబ్బడగా ఉంటే.. నాసికా మార్గంలోని శ్లేష్మం దృఢంగా, మరియు మందంగా ఉంటుంది . వేడి నీటి వల్ల అది కరుగుతుంది. అలాగే గోరు వెచ్చని నీటిలో తేనె, అల్లం రసం కలుపుకుని తాగినా ఉపశమనం లభిస్తుంది.

ముక్కుదిబ్బడగా ఉంటే.. ఆ ప్రాంతం వద్ద వెచ్చని కంప్రెస్‌ను కొంతసేపు ఉంచండి. రోజంతా వేర్వేరు సమయాల్లో వెచ్చని కంప్రెస్‌ను కొంతసేపు ముక్కు, ముఖం భాగాలపై ఉంచండి. గోరువెచ్చని నీళ్లలో ముంచిన క్లాత్‌ను పదే పదే ముక్కు పై ఉంచటం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది.
నిజానికి స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ జలుబు, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నవారు వీటిని తినడం వల్ల ముక్కు దిబ్బడ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Home Remedies,Stuffy Nose,Nasal congestion,Health Tips
Home Remedies, Stuffy Nose, Nasal congestion, Health, Health Tips, Telugu News, Telugu Global News, Today News, ముక్కు దిబ్బడా, జలుబు, తలనొప్పి, హోంరెమిడీస్
https://www.teluguglobal.com//health-life-style/how-to-clear-a-stuffy-nose-instantly-home-remedies-977336