https://www.teluguglobal.com/h-upload/2023/10/11/500x300_838965-aged.webp
2023-10-11 10:46:12.0
వయసు పైబడుతున్న కొద్దీ శరీరంలో మార్పులు రావడం, చర్మం ముడతలు పడడం సహజం. అయితే చాలామంది వయసులో కూడా అందంగా కనిపించాలనుకుంటారు.
వయసు పైబడుతున్న కొద్దీ శరీరంలో మార్పులు రావడం, చర్మం ముడతలు పడడం సహజం. అయితే చాలామంది వయసులో కూడా అందంగా కనిపించాలనుకుంటారు. దీనికోసం రకరకాల మేకప్‌లు, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటివి వాడుతుంటారు. అయితే వయసుతో పాటు చర్మంలో వచ్చే మార్పుల్ని రివర్స్ చేసేందుకు కొన్ని నేచురల్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ‘యాంటీ ఏజింగ్ థెరపీ’ చాలా పాపులర్.
యాంటీ ఏంజింగ్ థెరపీని ‘రెడ్ లైట్ థెరపీ’ అని కూడా అంటారు. చర్మంపై ఎర్రటి కాంతిని ప్రసరింపజేయడం ద్వారా చర్మాన్ని హీల్ చేయడం ఈ థెరపీ ప్రత్యేకత. ఇదెలా పనిచేస్తుందంటే..
యాంటీ ఏజింగ్ థెరపీలో శరీరంపై తక్కువ ఇంటెన్సిటీతో కూడిన ఎర్రటి కాంతి కిరణాలను ప్రసరింపజేస్తారు. చర్మ కణాల్లో ఉండే మైటోకాండ్రియా.. ఈ ఎరుపు రంగు కాంతి కణాలను గ్రహించడం ద్వారా చర్మంలో అడెనోసిన్ ట్రైఫాస్పేట్స్ అనే రసాయన ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. తద్వారా కణాలు రిపేర్ అయ్యి ముడతలు పడకుండా ఉంటాయి.
యాంటీ ఏజింగ్ థెరపీ లేదా రెడ్ లైట్ థెరపీ ద్వారా చర్మంలో కొత్త కణాలు తయారవుతాయి. పాడైపోయిన చర్మం రిపేర్ అవుతుంది. వయసుతో పాటు తగ్గుతూ ఉండే కొల్లాజెన్ పరిమాణం క్రమంగా పెరుగుతుంది. తద్వారా చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపించవు.
ఇకపోతే రెడ్ లైట్ కిరణాలు మొటిమలను కూడా తగ్గిస్తాయి. చర్మం పూర్తిగా రిపేర్ అవ్వడం వల్ల ముడతలు, మొటిమలు, మచ్చలు వంటివి క్రమంగా తగ్గుతాయి. అంతేకాదు ఈ థెరపీని జుట్టు కోసం కూడా వాడుకోవచ్చు. మాడుపై ఉండే చర్మం రిపేర్ అయ్యి హెయిర్ ఫాలికల్స్‌ను పటిష్టం చేస్తుంది. తద్వారా జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ థెరపీని వయసుపైబడిన వాళ్లే కాదు, యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్లు కూడా చేయించుకోవచ్చు. చర్మ పైపొరల్లో ఉండే కొవ్వు కరిగించడానికి, బ్రైట్‌గా కనిపించడానికి, స్కిన్ డీటాక్స్ చేసుకోవడానికి ఈ థెరపీ బెస్ట్ ఆప్షన్.
Anti Aging,Age,Health Tips,Therapy
Anti Aging, Age, Health, Health Tips, Health News, Telugu Global News, Telugu News, Latest Telugu News, Therapy
https://www.teluguglobal.com//health-life-style/do-you-know-about-anti-aging-therapy-that-slows-down-the-age-967057