డబుల్ చిన్ తగ్గడానికి చిట్కాలివే..

https://www.teluguglobal.com/h-upload/2023/07/31/500x300_802813-double-chin.webp
2023-07-31 15:54:58.0

వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, డబుల్‌ చిన్‌ వంటివి ఏర్పడడం సహజం. అయితే ఇప్పుడు చాలామందిలో యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే బుగ్గలు, మెడ చుట్టూ ఫ్యాట్ పేరుకుని.. డబుల్ చిన్ వస్తుంది.

వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, డబుల్‌ చిన్‌ వంటివి ఏర్పడడం సహజం. అయితే ఇప్పుడు చాలామందిలో యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే బుగ్గలు, మెడ చుట్టూ ఫ్యాట్ పేరుకుని.. డబుల్ చిన్ వస్తుంది. ఒబెసిటీ ఉన్నవాళ్లకి, వయసు పైబడుతున్న వారిని ఈ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంటుంది. మరి దీన్ని తగ్గించుకునేదెలా?

డబుల్‌ చిన్ సమస్యతో బాధపడే వారు ఆహారాన్ని బాగా నమిలి తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా నమలడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం అందుతుంది. దీనివల్ల ముఖ భాగంలో అదనపు కొవ్వులు పేరుకుపోకుండా ఉంటాయి. అలాగే తరచూ షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ నమలడం కూడా మంచిదే. తద్వారా దవడలు, మెడ దగ్గర పేరుకున్న కొవ్వు ఈజీగా కరుగుతుంది.

మెడ దగ్గర చర్మాన్ని బిగుతుగా మార్చడం కోసం గుడ్డులోని తెల్లసొనలో ఒక టేబుల్‌స్పూన్ పాలు, కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకోవాలి. అలా 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.

బిగ్గరగా నవ్వడం, మాట్లాడటం వల్ల కూడా ముఖ కండరాలకు చక్కని వ్యాయామం అందుతుంది. అలాగే మెడని గుండ్రంగా, నెమ్మదిగా కొద్ది సమయం పాటు తిప్పడం, పైకి-కిందకు కదిలించడం.. లాంటి చిన్నచిన్న వ్యాయామాల ద్వారా కూడా మెడ దగ్గరి కొవ్వు కరుగుతుంది. తద్వారా క్రమంగా డబుల్ చిన్ తగ్గుతుంది.

ఇక వీటితో పాటు కాఫీ, టీలకు బదులు డైట్‌లో గ్రీన్ టీని చేర్చుకోవాలి. గ్రీన్ టీ చెడు కొవ్వులను కరిగిస్తుంది. అలాగే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆహారంలో విటమిన్–ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రౌన్ రైస్, ఆకుకూరలు, స్వీట్ కార్న్, సోయా బీన్స్, పప్పు దినుసులు.. వంటివాటిల్లో విటమిన్– ఇ ఎక్కువగా లభిస్తుంది. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు కరిగిపోతాయి.

Double Chin,Health Tips,Double Chin Reduction Treatment,Treatment
Double Chin, double chin reduction, double chin exercise, double chin exercise machine, double chin exercises at home, Double Chin Reduction Treatment

https://www.teluguglobal.com//health-life-style/how-to-reduce-double-chin-951687