https://www.teluguglobal.com/h-upload/2023/02/21/500x300_723992-summer-skin-care.webp
2023-02-21 13:10:12.0
సమ్మర్‌లో ముఖ్యంగా జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం.. ఇలా చాలా రకాల స్కిన్ సమస్యలు వేధిస్తుంటాయి.
సమ్మర్ మొదలవుతోంది. ఎండలో బయటకు వెళ్లేవాళ్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యల బారిన పడే అవకాశం ఉంది. సమ్మర్‌లో ముఖ్యంగా జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం.. ఇలా చాలా రకాల స్కిన్ సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
వేసవిలో చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. వేసవిలో బయట ఎక్కువ ఎండ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకూ చర్మానికి నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. అలాగే వేసవిలో ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగుతూ ఉండాలి.
సమ్మర్‌లో చర్మ సౌందర్యం దెబ్బతినకూడదంటే.. స్నానానికి ముందు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్‌తో చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి. ఆపై స్నానం చేసి.. నేచురల్ స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంలోని మృత కణాలను తొలగిపోతాయి.
అవాంఛిత రోమాలను తొలగించుకోవడం కోసం వ్యాక్సింగ్ లాంటివి చేస్తుంటారు చాలామంది. అయితే సమ్మర్‌లో ఇలాంటి వ్యాక్సింగ్ వల్ల చర్మం మరింత ఇరిటేట్ అవుతుంది. అందుకే సమ్మర్‌లో వ్యాక్సింగ్‌కు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ చేసుకోవాలనుకుంటే దానికి ముందు చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సమ్మర్‌లో నెలకు ఒకసారి మాత్రమే వ్యాక్సింగ్ చేసుకునేలా చూసుకోవాలి.
వేసవిలో చర్మం తేమగా ఆరోగ్యంగా ఉండాలంటే చర్మానికి లోపలి నుంచి పోషణ అందించాలి. సమ్మర్‌లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పుచ్చకాయలు, జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవాలి.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా సమ్మర్‌లో బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పనిసరి. అది ఎండ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. అది కూడా ఎస్‌పీఎఫ్ 30 ఉండే లోషన్‌ను మాత్రమే రాసుకోవాలి. బయటికి వెళ్లడానికి కనీసం 20 నిమిషాల ముందే లోషన్ రాసుకుంటే మంచిది. అలాగే సమ్మర్‌లో మూడు సార్లు చన్నీటి స్నానం చేయడం వల్ల మంచి రిలీఫ్‌తో పాటు చర్మంపై పేరుకున్న దుమ్ము, చెమట వంటివి తొలగిపోతాయి.
Beauty Tips,Skin Care,Telugu News,summer,Health Tips
Beauty Tips, summer skincare, Summer skin care, skin in summers, healthy skin in summers, glowing skin in summers, Glowing skin, telugu news, telugu global news, latest telugu news, health tips in telugu, సమ్మర్‌లో స్కిన్ కేర్, స్కిన్ కేర్, సమ్మర్, స్కిన్ సమస్యలు, జిడ్డు చర్మం, మొటిమలు, వేడి, చర్మం పొడిబారడం
https://www.teluguglobal.com//health-life-style/summer-skin-care-tips-you-must-follow-this-season-telugu-news-893870