http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/mental-health-problems.gif
2016-05-19 00:33:55.0
ఇది ఆలోచించాల్సిన విషయం. అభివృద్ధి చెందిన దేశాలకే మనదేశం ఆదర్శంగా ఉందని, వారికే సంస్కృతి, విలువలు నేర్పుతున్నదని డబ్బా కొట్టుకుంటున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఈ విషయంమీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని మానసిక అనారోగ్య బాధితులలో మూడింటా ఒక వంతు మంది భారత్, చైనాల్లోనే ఉన్నారని ఒక అధ్యయనంలో తేలింది. ఈ సంఖ్య, మొత్తం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మానసిక రోగుల కంటే ఎక్కువ. ఇంతకంటే బాధపడాల్సిన విషయం ఈ రెండుదేశాల్లో మానసిక […]
ఇది ఆలోచించాల్సిన విషయం. అభివృద్ధి చెందిన దేశాలకే మనదేశం ఆదర్శంగా ఉందని, వారికే సంస్కృతి, విలువలు నేర్పుతున్నదని డబ్బా కొట్టుకుంటున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఈ విషయంమీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని మానసిక అనారోగ్య బాధితులలో మూడింటా ఒక వంతు మంది భారత్, చైనాల్లోనే ఉన్నారని ఒక అధ్యయనంలో తేలింది. ఈ సంఖ్య, మొత్తం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మానసిక రోగుల కంటే ఎక్కువ. ఇంతకంటే బాధపడాల్సిన విషయం ఈ రెండుదేశాల్లో మానసిక అనారోగ్యాలకు చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మనదేశంలో ప్రతి పదిమందిలో ఒకరు మాత్రమే చికిత్స పొందుతున్నారు. అంతేకాదు, ఇక్కడ ఒక లక్షమంది జనాభాకి కేవలం 0.3 స్థాయిలో సైకియాట్రిస్టులు అందుబాటులో ఉన్నారు.
దీనిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం… మానసిన అనారోగ్య బాధితుల సంఖ్యను బట్టి భారత్ 3కోట్ల 10 లక్షల సంవత్సరాల ఆరోగ్యవంతమైన జీవితాన్ని మానసిక అనారోగ్యం కోసం పోగొట్టుకున్నట్టయింది. చైనాలో ఈ లెక్క 3కోట్ల 60 లక్షల సంవత్సరాలుగా ఉంది. మానసిక వైకల్యంతో పాటు యాంగ్జయిటీ డిజార్డర్స్, వీటికోసం వాడుతున్న మందుల కారణంగా పనిచేయలేకపోవటం, మూర్ఛ తదితర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు.
వచ్చే దశాబ్దకాలంలో భారత్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా, చైనాకంటే విపరీతంగా తయారవుతుందని అధ్యయనంలో తేలింది. 2025 నాటికి చైనాలో ఈ పరిస్థితి 10 శాతం పెరిగితే అది మనదేశంలో 25శాతం వరకు పెరుగుతుందని అంచనా. భారత్, చైనాల్లో మానసిక చికిత్స విషయంలో మరింత కృషి అవసరమని ఈ అధ్యయనం చెబుతోంది. స్థానికంగా పనిచేసే హెల్త్ వర్కర్లు, సాంప్రదాయ వైద్యుల సహకారంతో ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలని సర్వే నిర్వాహకులు సలహా ఇస్తున్నారు. ఏదిఏమైనా టెక్నాలజీ, అభివృద్ధి అంటూ మెదడుని పరుగులు పెట్టిస్తున్న మనం మనసు గురించి పట్టించుకోవటం లేదనే వాస్తవానికి ఈ పరిస్థితి అద్దం పడుతోంది. ముఖ్యంగా శరీరానికి జబ్బుచేసినట్టే మనసుసైతం అనారోగ్యానికి గురవుతుంది..దానికి కూడా వైద్యం అవసరం…అందులో తప్పు, నామోషీగా ఫీలవ్వాల్సిన అవసరం లేదనే విషయాలను మనం ఇంకా బాగా ప్రచారంలోకి తీసుకువెళ్లాల్సి ఉంది.
mental health problems
https://www.teluguglobal.com//2016/05/19/mental-health-problems/