http://www.teluguglobal.com/wp-content/uploads/2016/06/sweets.gif
2016-06-17 05:19:20.0
తీపి అనేది కూడా ఒక వ్యసనమే. స్వీట్లు కనబడితే ఆగలేకపోవటం చాలామందిలో కనబడుతుంది. అయితే మనం తినాల్సిన దానికంటే ఎక్కువగా తీపి పదార్థాలు తినేస్తున్నామా… అని తెలుసుకునేందుకు వైద్యులు చెబుతున్న కొన్ని సూచనలు ఇవి– తీపి పదార్థాలు ఎంత ఎక్కువగా తింటూ ఉంటే…అంతగా ఇంకా తినాలనిపిస్తాయి. బాగా తీపిని తినాలనిపిస్తోందంటే దానికి అడిక్ట్ అయినట్టే భావించాలి. తీపి రుచిని నాలుక మీది రుచికణాలు ఆడాప్ట్ చేసుకుని మళ్లీ, మళ్లీ తినాలనిపించేలా చేస్తాయి. తీపి తీసుకోవటం పెరిగే కొద్ది […]
తీపి అనేది కూడా ఒక వ్యసనమే. స్వీట్లు కనబడితే ఆగలేకపోవటం చాలామందిలో కనబడుతుంది. అయితే మనం తినాల్సిన దానికంటే ఎక్కువగా తీపి పదార్థాలు తినేస్తున్నామా… అని తెలుసుకునేందుకు వైద్యులు చెబుతున్న కొన్ని సూచనలు ఇవి–
- తీపి పదార్థాలు ఎంత ఎక్కువగా తింటూ ఉంటే…అంతగా ఇంకా తినాలనిపిస్తాయి. బాగా తీపిని తినాలనిపిస్తోందంటే దానికి అడిక్ట్ అయినట్టే భావించాలి. తీపి రుచిని నాలుక మీది రుచికణాలు ఆడాప్ట్ చేసుకుని మళ్లీ, మళ్లీ తినాలనిపించేలా చేస్తాయి. తీపి తీసుకోవటం పెరిగే కొద్ది రుచికణాలు దానికి అలవాటు పడి మరింత తీపిని పెంచితే కానీ, రుచిని తెలుసుకోలేని స్థాయికి చేరుకుంటాయి.
- ఎక్కువ మొత్తంలో తీపిని తీసుకున్నపపుడు హార్మోనల్ స్పందనతో శరీరం ఉత్తేజితమవుతుంది. తరువాత అది డౌన్ అయిపోతుంది. దాంతో మళ్లీ తిపిని తినాలనే కోరిక కలుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలో హెచ్చుతగ్గులు వచ్చి, శరీరంలో శక్తిలో కూడా హెచ్చుతగ్గులు వస్తాయి. అలాగే మనోస్థితిలో కూడా తేడాలు వస్తాయి. దాంతో మానసిక స్థితి స్థిమితంగా ఉండదు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి.
- అంతేకాదు, షుగర్ ఎక్కువగా తింటున్నామంటే అర్థం శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, పీచుని తగినంత తీసుకోవటం లేదని కూడా. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన కొంతమందిలో చర్మంమీద మొటిమలు, ర్యాష్ వంటి సమస్యలు కలుగుతాయి. తీపి ఎక్కువగా తిన్నపుడు మన శరీరంలోని పాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయాలి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ని వివిధ అవయవాలకు చేరుస్తుంది. అప్పుడు అది శక్తిగా మారుతుంది. అందుకే మనం ఎక్కువ తీపిని తిన్నపుడు ఇన్సులిన్ మరింత ఎక్కువగా ఉత్పత్తి కావాలి. ఈ దశలో మన శరీరం సాధారణ స్థాయిలో ఉన్న ఇన్సులిన్కి స్పందించడం మానేస్తుంది. దాంతో శరీరం రక్తంలోని గ్లూకోజ్‌ని వినియోగించుకోవటం సక్రమంగా జరగదు. షుగర్‌తో కూడిన ఎక్కువ కేలరీలున్న ఆహారం తినటం వలన, ఇన్సులిన్ సరిగ్గా వినియోగించుకోలేని స్థితిలో శరీరం బరువుని పెరుగుతుంది. ఇలా పాంక్రియాస్ ఎక్కువకాలం ఎక్కువగా ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయాల్సి వస్తే అది మధుమేహానికి దారితీస్తుంది.
- లో బ్లడ్ షుగర్ ఉన్నవారు ఒక్కసారిగా తీపి పదార్థాలు ఎక్కువగా తింటే ఆ తేడా వలన మెదడు మందకొడిగా మారుతుంది. ఇక ఎక్కువ తీపి పదార్థాలతో నోటి బ్యాక్టీరియా పెరిగిపోయి పళ్లు దెబ్బతింటాయి.
https://www.teluguglobal.com//2016/06/17/అది-తీపి-కాదు-అనారోగ్యాల/