2016-07-24 12:42:30.0
స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారికి కంటికి సంబంధించిన గ్లకోమా వ్యాధికి గురయ్యే ప్రమాదం పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. స్లీప్ ఆప్నియా ఉన్నపుడు నిద్రలో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, గురక తదితర సమస్యలు ఉంటాయి. గ్లకోమా వ్యాధిని వాడుక భాషలో నీటికాసుల వ్యాధి అంటారు. కంటిపాప వద్ద స్రావాల ప్రసరణలో అడ్డంకులు ఏర్పడి కంటి నరం వద్ద ఒత్తిడి అధికమై అది బలహీనపడటం, ఫలితంగా దృష్టిక్షేత్రం తగ్గడం గ్లకోమా వలన ఎదురయ్యే సమస్యలు. తరువాత చూపుని కోల్పోయే […]
స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారికి కంటికి సంబంధించిన గ్లకోమా వ్యాధికి గురయ్యే ప్రమాదం పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. స్లీప్ ఆప్నియా ఉన్నపుడు నిద్రలో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, గురక తదితర సమస్యలు ఉంటాయి. గ్లకోమా వ్యాధిని వాడుక భాషలో నీటికాసుల వ్యాధి అంటారు. కంటిపాప వద్ద స్రావాల ప్రసరణలో అడ్డంకులు ఏర్పడి కంటి నరం వద్ద ఒత్తిడి అధికమై అది బలహీనపడటం, ఫలితంగా దృష్టిక్షేత్రం తగ్గడం గ్లకోమా వలన ఎదురయ్యే సమస్యలు. తరువాత చూపుని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
స్లీప్ ఆప్నియా ఉన్నవారికి నిద్రలో కంటి నరం మరింత ఒత్తిడికి గురవుతుందని జపాన్‌లోని హొక్కాయిడో యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. స్లీప్ ఆప్నియా కారణంగా నిద్రలో ఊపిరిని వదలటం ఆలస్యమయ్యే సమస్య ఉంటుంది. ఇలాంటపుడు కంటిపై అధిక ఒత్తిడి పడుతున్నట్టుగా వీరు గుర్తించారు. సాధారణంగా నిద్రపోతున్నపుడు కంటిపై కలిగే ఒత్తిడిని అంచనా వేయటం కష్టం. అయితే పరిశోధకులు కాంటాక్స్ లెన్స్‌లు ధరించేవారికి ప్రత్యేక సెన్సార్లను అమర్చి నిద్రలో వారి కళ్లమీద పడుతున్న ఒత్తిడిని గుర్తించారు. కాబట్టి నిద్రలో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, గురక సమస్యలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవటం మంచిది.
https://www.teluguglobal.com//2016/07/24/స్లీప్-ఆప్నియా-సమస్య-ఉ/