http://www.teluguglobal.com/wp-content/uploads/2016/08/ice.jpg
2016-08-07 00:06:51.0
సాధారణంగా పిల్లలు చాక్లెట్లు, ఐస్క్రీములు లాంటి చిరుతిళ్లను, జంక్‌ఫుడ్‌లను ఎక్కువగా అడుగుతుంటారు. ఏదో రుచికోసం తప్పితే, వాటివలన ఎలాంటి పోషకాలు అందవని తెలిసినా, పిల్లలకి నచ్చచెప్పలేక… తల్లిదండ్రులు వాటిని కొనిపెడుతుంటారు. అయితే పిల్లలు ఇష్టపడే అవే చిరుతిళ్లలో పోషకాలు పుష్కలంగా అందితే…చాలా మంచి విషయమే కదా. ఇప్పుడు అదే పనిచేస్తున్నారు సైంటిస్టులు. ఐస్క్రీములే కాక పలురకాల చిరుతిళ్లలో పోషకాలు నిండుగా ఉండేలా సరికొత్తగా తయారుచేస్తున్నారు. మైసూరులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి లేబరేటరీ, సెంట్రల్ […]
సాధారణంగా పిల్లలు చాక్లెట్లు, ఐస్క్రీములు లాంటి చిరుతిళ్లను, జంక్‌ఫుడ్‌లను ఎక్కువగా అడుగుతుంటారు. ఏదో రుచికోసం తప్పితే, వాటివలన ఎలాంటి పోషకాలు అందవని తెలిసినా, పిల్లలకి నచ్చచెప్పలేక… తల్లిదండ్రులు వాటిని కొనిపెడుతుంటారు. అయితే పిల్లలు ఇష్టపడే అవే చిరుతిళ్లలో పోషకాలు పుష్కలంగా అందితే…చాలా మంచి విషయమే కదా. ఇప్పుడు అదే పనిచేస్తున్నారు సైంటిస్టులు. ఐస్క్రీములే కాక పలురకాల చిరుతిళ్లలో పోషకాలు నిండుగా ఉండేలా సరికొత్తగా తయారుచేస్తున్నారు.
మైసూరులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి లేబరేటరీ, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లు…బెంగలూరులోని ఓలియోమ్ బయో సొల్యూషన్స్, డైరీ క్లాసిక్ ఐస్క్రీమ్స్ ప్రయివేట్ లిమిటెడ్ లతో కలిసి తయారుచేసిన ఐస్క్రీములో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల మెదడు పెరుగుదలకు, పెద్దవారి ఆరోగ్యానికి పనికొచ్చే ఒమేగా-3 ఫ్యాట్స్తో పాటు విటమిన్–ఇ ఉన్నాయి. అంతేకాక వీటి తయారీలో కూరగాయల పదార్థాలను వినియోగించారు. వీటి ద్వారా పిల్లలకు ఒక సర్వింగ్‌లో తగిన మోతాదులో ఒమేగా-3ప్యాట్స్ అందుతాయని…సంబంధిత సంస్థల అధికారులు వెల్లడించారు.
పోషకాల కలయికతో ఐస్క్రీములు, డిజర్ట్లే కాక….భారతీయ ఆహారపు అలవాట్లకు సూటయ్యేలా న్యూట్రి–చిక్కీ, రైస్మిక్స్, నువ్వుల పేస్ట్, రస్క్‌లు, పొడులు, మ్యాంగో బార్లు తదితర చిరుతిళ్లను తయారు చేస్తున్నారు. ఇవే కాదు…సురుచి మీఠా బర్ఫీ, చాకొలేట్ పాస్తా, బాజ్రా బ్రెడ్, రాగి రస్కులు, గుడ్డులేని కేక్ ప్రీ మిక్స్ లాంటివి… ఆరోగ్యకరమైన స్వీట్లుగా రూపొందించారు. సాధారణంగా చాక్లెట్లు, ఐస్క్రీములను పోషకాలు లేనివిగానే తల్లిదండ్రులు భావిస్తుంటారని…కానీ పిల్లలకు నచ్చే చిరుతిండిలోనే పోషకాలను అందించే ఉద్దశ్యంతో వీటిని తయారు చేస్తున్నామని, ఆరోగ్యాన్నిచ్చే డిసర్ట్లు, స్నాక్స్‌లను అందించడమే తమ లక్ష్యమని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు.
cisr,council of scientific and industrial research laboratories
https://www.teluguglobal.com//2016/08/07/council-of-scientific-and-industrial-research-laboratories/