http://www.teluguglobal.com/wp-content/uploads/2016/08/food-google.jpg
2016-08-09 23:07:57.0
ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసి తెప్పించుకోవటం ఇప్పుడు మరింత తేలిక కానుంది. యాప్స్‌తో పనిలేకుండా నేరుగా గూగుల్ సెర్చ్తోనే ఫుడ్ని ఆర్డర్ చేయవచ్చు. గూగుల్… పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్స్తో వ్యాపార భాగస్వామ్యంలోకి దిగడంతో ఇది సాధ్యం కానున్నది. జొమాటో, స్విగ్గి లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే…గూగుల్‌లోకి వెళ్లి మనకు దగ్గరలో ఉన్న హోటల్ సమాచారం వెతుక్కుంటే చాలు…సెర్చ్ రిజల్ట్‌లోనే ఆర్డర్ ఇవ్వండి…అనే ఆప్షన్ వస్తుంది. అక్కడి నుండే జొమాటో, స్విగ్గిలాంటి డెలివరీ […]
ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసి తెప్పించుకోవటం ఇప్పుడు మరింత తేలిక కానుంది. యాప్స్‌తో పనిలేకుండా నేరుగా గూగుల్ సెర్చ్తోనే ఫుడ్ని ఆర్డర్ చేయవచ్చు. గూగుల్… పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్స్తో వ్యాపార భాగస్వామ్యంలోకి దిగడంతో ఇది సాధ్యం కానున్నది. జొమాటో, స్విగ్గి లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే…గూగుల్‌లోకి వెళ్లి మనకు దగ్గరలో ఉన్న హోటల్ సమాచారం వెతుక్కుంటే చాలు…సెర్చ్ రిజల్ట్‌లోనే ఆర్డర్ ఇవ్వండి…అనే ఆప్షన్ వస్తుంది. అక్కడి నుండే జొమాటో, స్విగ్గిలాంటి డెలివరీ సర్వీస్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక పూర్తి ఆర్డరుని ఇవ్వడానికి అక్కడనుండి డెలివరీ సర్వీస్ వెబ్సైట్ల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
గూగుల్…తన బ్లాగ్ పోస్ట్లో ఈ వివరాలు వెల్లడించింది. గూగుల్ ఇప్పుడు సెర్చ్ చేసే యూజర్లకు కేవలం మార్గదర్శకంగా ఉండటమే కాకుండా నేరుగా ఆన్లైన్ సదుపాయాలు కల్పించే పనిలో ఉంది. అందులో భాగంగానే… ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసే ఈ అవకాశాన్నికల్పించింది.
google food,Ordering food online
https://www.teluguglobal.com//2016/08/10/ordering-food-online-you-can-now-just-google-it/